Modi govt on 8th Pay Commission: మోదీ సర్కారు దసరా పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఉద్యోగులు 8వ వేతన సవరణ సంఘం ఎప్పుడు ఉంటుందా.. అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రతి ఏడాది వేతనాల సవరణ రెండు సార్లు ఉంటుంది. జనవరి, జులై నెలలో సార్లు జీతాలు పెరుగుతాయి. ప్రస్తుతం మార్కెట్ లో కొన్ని రోజులుగా భారీగా ద్రవ్యోల్బణం ఏర్పడింది.
వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే విధంగా డబ్బులు విలువ మాత్రం క్రమంగా తగ్గిపోతుంది. అందుకే ప్రతి వేతన జీవి సైతం వేతనాలు ఎప్పుడు అప్ డేట్ అవుతాయా..అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, కేంద్రం 8వ వేతన సవరణపై కీలక అప్ డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒక మారు పే కమిషన్ లు ఏర్పటు చేస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవ భత్యాలు, డీఏలు మొదలైన వాటిని లెక్కల్ని చూస్తుంది. అదే విధంగా ఈ పే కమిషన్ ల సిఫారసుల ఆధారంగానే శాలరీల పెరుగుదల ఉంటుంది. అయితే.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 వ వేతన సవరణ సంఘం సిఫారసులు అమలు చేస్తున్నారు.
ఏడో వేతన సంఘాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేశారు. ఇది నవంబర్ 19, 2015న తన నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో.. ఏడవ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని సిఫారసుల మేరకు.. కేంద్రం ఉద్యోగులకు డీఏ 4శాతం పెంచడంతో.. 50 శాతానికి చేరుకుంది.
మరోవైపు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు.. జులై మాసంలో పెంపుదల ఎప్పటి నుంచి అమలు చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. 7 వ వేతన సంఘం సిఫారసులు.. దాదాపు 3 నుంచి 4 శాతం వరకు ఉంటుందని కూడా తెలుస్తోంది. కొత్త సిఫారుల ప్రకారం.. 54 శాతం వరకు పెరగొచ్చని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉండగా.. 8వ వేతన సంఘం జనవరి 1 ,2026 సంవత్సరంలో అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. పే కమీషన్లను అమలు చేయడానికి దాదాపు .. ఏడాది నుండి 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు 8వ వేతన సంఘం నోటిఫికేషన్ వస్తే 2026లో అమలు చేయవచ్చని తెలుస్తోంది.. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిత్యం ఈ విషయమై
సాధారణంగా పే కమీషన్లు ఏర్పాటు చేయబడినప్పుడు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థలో మార్పులు చేస్తారు. ఫిట్మెంట్ లను పెంచి, తదనుగుణంగా మూల వేతనం పెంచారు. ఇది కాకుండా, అలవెన్సులు, ఇతర అంశాలలో కూడా మార్పు ఉంది, ఫలితంగా ఉద్యోగుల మొత్తం వేతనాలు భారీగా పెరిగాయి. దీంతో ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కొత్త వేజ్ బోర్డులు ఊరటనిస్తాయని చెప్పుకొవచ్చు.
7వ వేతన సంఘం ఏర్పాటు చేసినప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 రెట్లు పెంచాలని డిమాండ్ చేశారు. కానీ ఆ తర్వాత 2.57 రెట్లు ఫిక్స్ అయింది. అందువల్ల, 8వ వేతన సంఘంలో ఇది 3.68 రెట్లు పెరుగుతుందని అంచనా. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనం దాదాపు రూ.26,000కి మారే అవకాశం ఉంది. దీంతో 44 శాతం జీతం పెరగనుందని తెలుస్తోంది.
8వ వేతన సంఘం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల జీతాల్లో భారీగా పెంపుదల ఉంటుంది. ఉద్యోగులకు 20% నుంచి 35% వరకు జీతాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. లెవల్ 1 ఉద్యోగుల జీతం దాదాపు రూ.34,560 ఉంటుందని, లెవల్ 18 ఉద్యోగుల వేతనాన్ని రూ.4.8 లక్షలకు పెంచనున్నట్టు సమాచారం. (Disclimer: పైన పేర్కొన్న అంశాలను Zee Mediaధృవీకరించలేదు)