Nazriya Nazim Pics: పండగ పూట.. భర్త కౌగిలిలో నజ్రియా నజీమ్!

Nazriya Nazim Ramadan 2022 Photos. ఈ మధ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న నజ్రియా.. వరుసగా పిక్స్ షేర్ చేస్తున్నారు. నేడు రంజాన్ పండగ సందర్భంగా తన భర్త ఫాహద్‌ ఫాజిల్‌తో దిగిన ఫొటోస్ పంచుకున్నారు. 

  • May 03, 2022, 16:35 PM IST
1 /6

ఈ మధ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న నజ్రియా.. వరుసగా పిక్స్ షేర్ చేస్తున్నారు. నేడు రంజాన్ పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో హాయిగా గడిపారు. తన భర్త, నటుడు ఫాహద్‌ ఫాజిల్‌తో దిగిన ఫొటోస్ పంచుకున్నారు. 

2 /6

2018లో వచ్చిన వరదన్‌ సినిమాతో నజ్రియా నజీమ్ నిర్మాతగా మారారు. కుంబలంగి నైట్స్‌, సీయూ సూన్‌ సినిమాలను నిర్మించారు. 

3 /6

'బెంగళూర్‌ డేస్‌' సినిమా సమయంలో ఫాహద్‌ ఫాజిల్‌తో ప్రేమలో పడిన నజ్రియా నజీమ్.. 2014లో వివాహం చేసుకున్నారు. తన కన్నా 15 ఏళ్లు పెద్దవాడైన ఫాహద్‌ను 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు.   

4 /6

1994 డిసెంబర్‌ 20న కేరళలో జన్మించిన నజ్రియా నజీమ్.. పదేళ్ల వయసులో బుల్లితెరపై యాంకర్‌గా అడుగుపెట్టారు. 2006లో బాలనటిగా మమ్ముట్టితో నటించారు.

5 /6

మలయాళంలో స్టార్‌ హీరోయిన్‌ అయిన నజ్రియా నజీమ్.. రాజా రాణి సినిమాతోనే తమిళ, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా 'అంటే సుందరానికి' సినిమాతో తొలిసారి నేరుగా తెలుగు సినిమా చేస్తున్నారు. 

6 /6

మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఇప్పటివరకూ ఒక్క సినిమా చేయకున్నా.. 'రాజా రాణి' సినిమాతో మనోళ్లకు పరిచయమే.