Gujarat Drugs Seized: గుజరాత్ తీరంలో డ్రగ్స్ కలకలం.. 5వేల కోట్ల మాదక ద్రవ్యాల సీజ్..

Gujarat Drugs Seized: గుజరాత్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. దాదాపు 518 కిలోల కొకైన్‌ను పోలీసులు సీజ్‌ చేశారు.

1 /6

Gujarat Drugs Seized: ఇటీవల దేశ రాజధాని దిల్లీలోనూ కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండు ఘటనల్లో వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు.

2 /6

దేశ రాజధాని తర్వాత గుజరాత్ తీరంతో నార్కోటిక్ పోలీసులు 518 కిలోల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు.  అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 5వేల కోట్లు ఉంటుందని అంచనా. ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పోలీసులు అంక్లేశ్వర్‌లోని ఓ కంపెనీలో తనిఖీలు నిర్వహించగా.. ఈ మేరకు భారీ స్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.

3 /6

ఢిల్లీ పోలీస్, గుజరాత్‌ పోలీసులు ఆదివారం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టి దాదాపు 518 కిలోల కొకైన్‌ను ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

4 /6

అక్టోబర్‌ 1న స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఢిల్లీలోని మహిపాల్‌పుర్‌లోని గోదాంలో సోదాలు జరిపి.. 562 కేజీల కొకైన్‌, 40కిలోల హైడ్రోపోనిక్‌ మారిజునాను సీజ్‌ చేశారు.

5 /6

ఈ కేసు దర్యాప్తులో వచ్చిన సమాచారం ఆధారంగా అక్టోబర్‌ 10న ఢిల్లీలోని రమేశ్‌ నగర్‌ ప్రాంతంలోని ఓ షాప్‌లో దాడులు చేసి 208కిలోల కొకైన్‌ను సీజ్‌ చేసినట్లు పోలీసు వర్గాలు ఇటీవల వెల్లడించాయి.

6 /6

కేవలం 15 రోజుల వ్యవధిలో ఢిల్లీ, గుజరాత్‌లలో దాదాపు 13వేల కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.