Akhil Wedding: అక్కినేని అఖిల్‌ పెళ్లి ఆరోజే ఫిక్స్‌.. జైనబ్‌ మంచి అమ్మాయి: నాగార్జున

Akhil Wedding Announcement: అక్కినేని అఖిల్‌ ఎంగేజ్మెంట్‌ అయిందని సడన్‌గా సోషల్‌ మీడియాలో ఇటీవలె అక్కినేని నాగార్జున పోస్ట్‌ చేసి షాకింగ్‌ ఇచ్చారు. ఇదిలా ఉండగా చాలామంది నాగచైతన్య శోభిత, అఖిల్‌ జైనబ్‌ల వివాహం ఒకేరోజు ఉండచ్చని ప్రచారం చేశారు. దీనిపై హీరో నాగార్జున స్పందించారు.
 

1 /6

అక్కినేని అఖిల్‌ జైనబ్‌ల ఎంగజ్‌మెంట్‌ 26వ తేదీ జరిగన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవలె హీరో నాగార్జున అధికారికంగా ప్రకటించి సడన్‌ షాక్‌ ఇచ్చారు.  

2 /6

మరోవైపు నాగచైతన్య శోభితల వివాహం కూడా డిసెంబర్‌ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియో వేదికగా జరగనుంది. అయితే, ఈ రెండు జంటల పెళ్లి ఒకేరోజు జరగనుందని పెద్ద ఎత్తుగా ప్రచారం జరిగింది.  

3 /6

దీనిపై నాగార్జున స్పందించారు. అఖిల్‌ విషయంలో చాలా ఆనందంగా ఉంది, జైనబ్‌ చాలా మంచి అమ్మాయి వాళ్లు పెళ్లి చేసుకోవడం మంచి విషయం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  

4 /6

అంతేకాదు ఈ ఏడాది తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైంది, ఇద్దరు తనయుల కొత్త అధ్యయనంతోపాటు నాన్నగారి శత జయంతి ఉత్సవాలు కూడా జరిగాయి అని హీరో నాగార్జున అన్నారు.  

5 /6

హీరో నాగచైతన్య శోభిత వివాహం డిసెంబర్‌ 4 న జరగనుంది. ఇదిలా ఉండగా నాగచైతన్య హీరోయిన్‌ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థాలతో విడపోయారు. ఆ తర్వాత శోభితతో పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.  

6 /6

మరోవైపు హిరోయిన్‌ సమంత 'సిటాడెల్‌- హనీ బన్నీ' ఇటీవల హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మొదటి పెళ్లి గురించిన కొన్ని విషయాలను సమంత పంచుకున్న విషయం తెలిసిందే...