Amazon Prime Day Sale 2022: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 జూలై 23, 24 తేదీల్లో ఉంది. అంటే మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మంచి మంచి ఆఫర్లు ఉంటాయని వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్..ఇలా అన్ని రకాల వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఆఫర్ల పూర్తి ప్రయజనాలు పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 ..జూలై 23, 24 తేదీల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో ప్రత్యేకత లైటినింగ్ డీల్స్ ఆఫర్లు ఉంటాయి. ఈ అవకాశం తప్పకుండా వినియోగించుకోండి. ఎందుకంటే బెస్ట్ ఆఫర్లు ఉంటాయి ఈ సమయంలో.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 ఆఫర్లు, డిస్కౌంట్లు పొందాలంటే ఏం చేయాలనేది వివరించాం. సేల్ ప్రారంభమైన తరువాత ఏ వస్తువు ధరైనా మరింతగా తగ్గుతుందని నిరీక్షించవద్దు. ఆ సమయంలో ఏది బెస్ట్ డీల్ ఉందో అదే ఫైనల్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసేముందు డీల్‌లో ఇచ్చిన బ్యాంక్ ఆఫర్లు కూడా పరిశీలించాలి. ఈ సేల్‌లో ఎస్బీఐ పార్టనర్ బ్యాంక్‌గా ఉంది. ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో డిస్కౌంట్ ఎందులో ఉందో చెక్ చేసుకోండి. డిస్కౌంట్ అనంతరం అమెజాన్ పే బ్యాలెన్స్ వినియోగిస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా అమెజాన్ వ్యాలెట్ ఫిల్ చేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022లో ప్రయోజనాలు పొందాలంటే ముందుగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ కావాలి. ఎందుకంటే ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఒక నెల 179 రూపాయలకు లభించనుంది మూడు నెలలకైతే 459 రూపాయలు, ఏడాది కోసం 1499 రూపాయలు చెల్లించాలి.