Amrapali: గొప్ప మనసు చాటుకున్న ఆమ్రపాలీ.. జీహెచ్ఎంసీ మహిళ ఉద్యోగులకు బంపర్ ఆఫర్..

Ghmc commissioner amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కాట మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

1 /6

హైదరాబాద్ కు ఇటీవల జీహెచ్ఎంసీ కి ఆమ్రపాలీ కాటను పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించారు.ఈ క్రమంలో ఆమ్రపాలీ తనదైన స్టైల్ లో పాలనలో స్పీడ్ ను పెంచారు.  

2 /6

ఇటీవల హైదరాబాద్ లో వరదలు సంభవించిన ప్రాంతాలలో పరిశీలించారు. అంతేకాకుండా.. ఒకవైపు అధికారులతో సమన్వయం చేసుకుంటునే మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు.

3 /6

ఈ నేపథ్యంలో తాజాగా, ఆమ్రపాలీ కాట తీసుకున్న నిర్ణయం పట్ల ఇప్పుడు సర్వత్ర ప్రశసంలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో ఆరు జోన్లు, 30 సర్కిళ్లు ఉన్నాయి.ఈ క్రమంలో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే.. ఒక బేబీకేర్ సెంటర్ ఉంది.

4 /6

దీంతో జీహెచ్ఎంసీ ఉద్యోగ సంఘాలు ఇటీవల .. కమిషనర్ కు చైల్డ్ కేర్ సెంటర్ పట్ల తమ బాధను చెప్పుకున్నారు. కనీసం జోన్ కు  ఒక్కటైన చైల్డ్ బేబి సెంటర్ లను ఏర్పాటు చేయాలని కూడా ఉద్యోగులు కోరారంట. దీనికి ఉద్యోగులు కలలో కూడా ఊహించని విధంగా ఆమ్రపాలీ రెస్పాండ్ అయ్యారు.

5 /6

ప్రస్తుతం హైదరబాద్ లో ఉన్న.. 30 సర్కిళ్లలో కూడా బేబికేర్ సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న వాళ్లను కేర్ టెకర్ లుగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్ మెంట్ కు దగ్గరున్న వాళ్లు చిన్న పిల్లలకు మంచి ప్రేమను అందిస్తారు. 

6 /6

అందుకే రిటైర్ మెంట్ కు... మూడు, నాలుగు ఏళ్లు గ్యాప్ ఉన్న వాళ్లను చైల్డ్ కేర్ సెంటర్ లకు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జీహెచ్ఎంసీ మహిళ ఉద్యోగులు .. కమిషనర్ ఆమ్రపాలీ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తంచేస్తున్నారు.