Vishnupriya Photoshoot : సాంబ్రాణి ధూపం.. పెంచింది తాపం.. పిచ్చెక్కిస్తోన్న యాంకర్ విష్ణుప్రియ

Vishnupriya Photoshoot యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత మామూలుగా ఉండదు. ఆమె చేసే అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.
 

  • Oct 21, 2022, 13:46 PM IST
1 /6

యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింలతో ఫేమస్ అయింది విష్ణుప్రియ. ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. పోవే పోరా షోతో మంచి ఇమేజ్ సంపాదించుకుంది. 

2 /6

అయితే సిల్వర్ స్క్రీన్ మీద చేసిన చెక్ మేట్ సినిమాలో హద్దులు దాటే అందాల ప్రదర్శన చేయడంతో విమర్శలు మూటగట్టుకుంది. ఆ తరువాత సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉంటూ వచ్చింది.

3 /6

విష్ణుప్రియ ఫోకస్ అంతా కూడా బుల్లితెరపైనే పెట్టేసింది. బుల్లితెరపై జబర్దస్త్, అదిరింది, బొమ్మ అదిరింది, పండుగ ఈవెంట్లో స్కిట్లు, స్టెప్పులు వేస్తూ ఉండేది.

4 /6

యూట్యూబ్‌లో విష్ణుప్రియ తన పేరు మీదుగా పెట్టుకున్న చానెల్ ద్వారా బాగానే సంపాదించేస్తోంది. తన యూట్యూబ్ ఆదాయం భారీగా ఉందంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

5 /6

విష్ణుప్రియ ఈ మధ్య యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. బిగ్ బాస్ మానస్‌తో కలిసి విష్ణుప్రియ చేసిన ప్రైవేట్ ఫోక్ సాంగ్ అదిరిపోయింది. మాస్ స్టెప్పులతో ఇద్దరూ కుమ్మేశారు.

6 /6

ప్రస్తుతం యాంకర్ విష్ణుప్రియ బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా దూసుకపోతోంది. సినిమా ఆఫర్ల కోసం విష్ణుప్రియ ఆరాట పడుతున్నట్టుగా అనిపిస్తోంది.