AP Liquor Lovers : ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువు దీరిన తెలుగు దేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీలో మద్యం బాబులకు గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి. మూడు రోజులుగా జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. అంతేకాదు మందుబాబులతో కొత్త షాపులు కళకళలాడుతున్నాయి.
అయితే మద్యం షాపుల పక్కన పర్మిట్ రూమ్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కొత్త పాలసీలో ఈ పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించలేడు.
దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనే టాక్ వినిపిస్తోంది. మరో వైపు ఈ నిర్ణయంతో షాపుల పక్కన మద్యం తాగే వీలుండే పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇవ్వకపోవడంతో బార్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
ఒక రకంగా మద్యం తాగాలనుకునే వారికి ఇది శరాఘాతంగా మారింది. మద్యం షాపులతో పాటు పక్కనే పర్మిట్ రూమ్ లకు అనుమతులు ఇవ్వాలని ఏపీ తాగుబోతుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
పాత ప్రభుత్వం నాణ్యమైన మద్యం ఇవ్వనందునే వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగడంలో ఏపీలోని తాగుబోతులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరి ప్రభుత్వం మందు బాబుల విజ్ఞప్తిని చెవినెక్కించుకుంటుందా అనేది చూడాలి. అయితే... ఇపుడిపుడే కొత్తగా మద్యం షాపులు తెరిచిన నేపథ్యంలో విడతల వారీగా పర్మిట్ రూమ్ లకు కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు.