Anupama Parameswaran: నల్ల చీరలో కాటుక కళ్లతో కవ్విస్తోన్న టిల్లు భామ అనుపమ పరమేశ్వరన్..

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్  తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో వెండితెరకు పరిచయమైంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.

1 /6

అనుపమ పరమేశ్వరన్.. ఈ యేడాది ‘టిల్లు స్క్వేర్’ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో లిల్లి జోసెఫ్ పాత్రలో అదరగొట్టేసింది.

2 /6

అనుపమ పరమేశ్వర్ కేరళలోని ఇరంజకుడాలో 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. అంతేకాదు మలయాళ క్లాసిక్ హిట్ ‘ప్రేమమ్’ మూవీతో తెరంగేట్రం చేసింది. అందులో మేరీ జార్జ్ పాత్రలో హీరో ఫస్ట్ లవర్ పాత్రలో అదరగొట్టింది.

3 /6

అదే సినిమా తెలుగులో అదే ప్రేమమ్ టైటిల్ తో నాగ చైతన్య హీరోగా తెరకెక్కింది. ఈ సినిమాలో సుమగా చైతూ ఫస్ట్ క్రష్ గా నటించి మెప్పించింది.

4 /6

మలయాళీ భామ అయిన అనుపమకు ప్రారంభంలో ఛాన్సులు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీతో ముందుగా ఈ భామనే అనుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో సమంతను తీసుకున్నారు. ఒకవేళ ఈ పాత్ర అనుపమకు దక్కి ఉంటే ఆమె రేంజే వేరే లెవల్లో ఉండేది.

5 /6

ప్రస్తుతం ఈమె స్టార్ హీరోల సరసన కాకుండా మిడ్ రేంజ్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారింది. నిఖిల్ సిద్దార్ధ్ తో చేసిన ‘కార్తికేయ 2’ తో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది.

6 /6

తాజాగా ఈ యేడాది ‘టిల్లు స్క్వేర్ మూవీతో హిట్ అందుకున్నా.. అనుపమకు పెద్దగా ఒరింగిందేమి లేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో వివిధ భాషల్లో అర డజనుకు పైగా చిత్రాలున్నాయి.