Bonalu 2024: బోనాల పండుగ.. భక్తులు ఈ పరిహారం పాటిస్తే అఖండ ధనయోగం, నచ్చిన అమ్మాయితో పెళ్లి..

Ashada masam bonalu: ఆషాడ మాసంలో బోనాల పండుగను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. ఇప్పటికే బోనాల వేడుక చివరి అంకానికి చేరుకుందని చెప్పుకొవచ్చు.  ఆదివారం, సోమవారం లాల్ దర్వాజతో పాటు పలుచోట్ల బోనాలు జరగనున్నాయి. 

1 /5

బోనాల నేపథ్యంలో ఆలయాలన్ని కూడా అందంగా ముస్తాబు చేశారు. ఇక గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో కూడా వేడుకగా జరిగాయి. ఇక శనివారం, ఆదివారం లాల్ దర్వాజ సింహావాహిని అమ్మవారి ఆలయంలో బోనాలు జరుగునున్నాయి.

2 /5

ఈ నేపథ్యంలో బోనాలు పండుగ నేపథ్యంలో శివసత్తులు, పోతరాజుల విన్యాసాలు, తొట్లెల ఊరేగింపు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. తొట్లెలలో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంటారు. తొట్లెలపై దుష్టశక్తుల ప్రభావం ఉండకుండా.. పోతరాజు కొరడా పట్టుకుని కాపాలాగా ఉంటాడు. అనాదీగా వస్తున్న ఆచారాలను పాటిస్తే జీవితంలో కలిగే చెడు ఫలితాలు దూరమౌతాయని పెద్దలు చెబుతుంటారు.

3 /5

 బోనాల పండుగ నేపథ్యంలో కొన్ని పరిహరాలు పాటిస్తే మాత్రం జీవితంలో అఖండ ధనయోగం కల్గుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. బోనాల పండుగ రోజున ఉదయం నిద్రలేచీ, స్నానాదులు పూర్తి చేసుకొవాలి. ఈరోజున అమ్మవారికి బోనం సమర్పించాలి. ముఖ్యంగా బోనం రోజు అమ్మవారి తోట్లెలు, పోతరాజులను ఊరేగిస్తుంటారు. పోతరాజులను మన ఇంటికి ఆహ్వానించాలి.  

4 /5

పోతరాజు కాళ్లుకడిగి, ఆయనతో కొరడా దెబ్బలు తినాలి. దీని వల్ల మన ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ, చెడు ప్రభావం కూడా బైటకు వెళ్లిపోతుంది. పోతరాజుచేతితో ఒక రూపాయి కాయిన్ ను అమ్మవారి ముందు ఉంచి ఇప్పించుకొవాలి. దీన్ని ఎర్రటి బట్టలోచుట్టి లాకర్ లో పెట్టాలి. అస్సలు తీయకూడదు. ఇలా చేస్తే ఆ ఇంట్లో డబ్బులకు ఎప్పటికి లోటు ఉండదని చెప్తుంటారు.   

5 /5

బోనాల పండుగ రోజు ప్రత్యేకంగా నైవేద్యం చేసి శివసత్తులు, పోతరాజులకు తిన్పించాలి. వీరికి వస్త్రదానం, పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేస్తే చేసే పనుల్లో వచ్చే ఆటంకాలన్ని దూరమైపోతాయని కూడా చెప్తుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)