Bank nominee: మనం బ్యాంకులో అకౌంట్ తీసుకుంటే తప్పనిసరిగా నామినీ పేరు చేర్చాల్సిందే. మన తర్వాత బ్యాంకు ఖాతాపై హక్కు నామినీకి ఉంటుంది. అయితే అసలు అకౌంట్ కు ఒక్కరిని మాత్రమే ఎందుకు పెట్టాలనే ప్రశ్న అందరికీ ఉంటుంది. తాజాగా కొన్ని బ్యాంకులు ఈ నామినీలపై కొన్ని మార్పులు చేర్పులు చేశాయి. అవేంటో చూద్దాం.
Bank nominee: బ్యాంకులో అకౌంట్ తీసుకోవాలనుకుంటే నామినీ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మన అకౌంట్ పై మన తర్వాత నామినీకే హక్కు ఉంటుంది. కానీ నామినీ వ్యవస్థ ఉండటం వల్ల మరింత సులభం అవుతుంది. నామినీ వ్యక్తి బ్యాంకులో సంప్రదించి అవసరమైన పత్రాలు అందించి అకౌంట్ పొందవచ్చు.
ఇది కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణమే ఆర్థిక సహాయం పొందేందుకు వీలు అవుతుంది. ఖాతాదారుడు బ్యాంకులో నామినీ పేరును నమోదు చేయాలి. ఖాతాదారుడి మరణం తర్వాత బ్యాంకు నామినీ పత్రాలను పరిశీలించి ఆడిట్ చేసి ఆ తర్వాత ఎలాంటి న్యాయప్రక్రియ లేకుండా నిధులను అందిస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఖాతాదారుని మరణం తర్వాత వారసుల మధ్య వివాదాలు వస్తుంటాయి. ఈ సందర్బంలో బ్యాంకు నామినీ వ్యవస్థ కాస్త స్పష్టతనిస్తుంది. ఎందుకంటే ఖాతాదారులు తన పర్మిషన్ తో నామినీని సూచించగా..అవి ప్రధాన ఆధారంగా ఖాతాలోని నిధుల జారీకి ఆధారమవుతుంది. త్వరలో బ్యాంకు ఖాతా నామినేషన్ కు సంబంధించి కొత్త రూల్స్ రాబోతున్నాయి. బ్యాంకింగ్ సవరణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందినట్లయితే ఇది జరుగుతుంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షురూ అయ్యాయి. ఈ సెషన్ లో బ్యాంకింగ్ రంగంలో తీసుకురావాల్సిన కీలక మార్పుల కోసం బ్యాంకింగ్ సవరణ బిల్లును సర్కార్ ప్రవేశపెట్టనుంది.
బ్యాంకు ఖాతాల్లోని నామినీల పేర్ల సంఖ్యను ఒకటి నుంచి 4 వరకు పెంచే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతా వాడే ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాలో నుంచి ఒకరు కాదు 4 నామినీ పేర్లను పెట్టడం తప్పనిసరి
అంతేకాదు ఖాతాదారు మరణిస్తే ఆ ఖాతాపై నలుగురు నామినీలకు ఒకేసారి హక్కు వచ్చేలా చూస్తుంది. ప్రతి నామినీకి అకౌంట్లో మొత్తం డబ్బును సరిసమాన భాగం చేసి ఇస్తుంది.