Skin Care Tips: రోజూ స్నానం చేశాక ఇలా చేస్తే రెట్టింపు అందం మీ సొంతం

వేసవిలో ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ చర్మం మాత్రం దెబ్బతింటుంది. అందుకే ప్రత్యేకమైన చర్మ సంరక్షణ అవసరం. చర్మం నిర్జీవంగా మారి కళ తప్పిపోతుంది. చర్మంపై ర్యాషెస్ రావచ్చు. దురద ఉంటుంది. ఇలా చాలా సమస్యలే ఉత్పన్నమౌతుంటాయి. అయితే స్నానం చేసిన వెంటనే కొన్ని చిట్కాలు పాటిస్తే రెట్టింపు అందం రావడం ఖాయమంటున్నారు బ్యుటీషియన్లు

Skin Care Tips: వేసవిలో ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ చర్మం మాత్రం దెబ్బతింటుంది. అందుకే ప్రత్యేకమైన చర్మ సంరక్షణ అవసరం. చర్మం నిర్జీవంగా మారి కళ తప్పిపోతుంది. చర్మంపై ర్యాషెస్ రావచ్చు. దురద ఉంటుంది. ఇలా చాలా సమస్యలే ఉత్పన్నమౌతుంటాయి. అయితే స్నానం చేసిన వెంటనే కొన్ని చిట్కాలు పాటిస్తే రెట్టింపు అందం రావడం ఖాయమంటున్నారు బ్యుటీషియన్లు

1 /5

సీరమ్ స్నానం చేశాక మాయిశ్చరైజర్ రాస్తే సీరమ్ కూడా రాయాల్సిందే. దీనివల్ల రోజంతా ముఖం హైడ్రేట్‌గా ఉంటుంది. ముఖానికి అద్భుతమైన కళ వస్తుంది. 

2 /5

సన్‌స్క్రీన్ వేసవికాలంలో అన్నింటికంటే ముఖ్యమైంది సన్‌స్క్రీన్. సూర్యుని హానికారక కిరణాల్నించి చర్మాన్ని రక్షిస్తుంది. ఇంట్లో ఉన్నా లేక బయటికెళ్లినా సన్‌స్క్రీన్ తప్పకుండా రాయాలి.

3 /5

స్కిన్ టోనర్ స్కిన్ టోనర్ చాలా ముఖ్యమైంది. స్కిన్ టోనర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల చర్మానికి అద్బుతమైన నిగారింపు వస్తుంది. స్నానం చేసిన వెంటనే స్కిన్ టోనర్ రాయడ వల్ల నిగారింపు ఉంటుంది. 

4 /5

అల్లోవెరా అల్లోవెరా చర్మానికి చాలా ప్రయోజనకరం. చర్మాన్నిలోపల్నించి హైడ్రేట్ చేస్తుంది. రోజూ స్నానం చేసిన తరువాత అల్లోవెరా రాయడం వల్ల చర్మంపై మచ్చలు వంటి సమస్యలు తొలగిపోతాయి. 

5 /5

మాయిశ్చరైజర్ వేసవికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. లేకపోతే వివిధ రకాల సమస్యలు ఎదురౌతాయి. అందుకే స్నానం చేసిన తరువాత మర్చిపోకుండా ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల చర్మం హైడ్రేట్గా ఉంటుంది.