Best Breakfast For Weight Loss : మీ బ్రేక్ ఫాస్ట్‎లో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే.. బరువు తగ్గడంతోపాటు ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరుగుతుంది

Breakfast for weight loss: ఊబకాయం సమస్య నుంచి మీరు బయటపడాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఉదయం లేవగానే ఎక్సర్సైజులు చేస్తే సరిపోదు. మీ అల్పాహారం లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 /8

weight loss Breakfast Recipes : ఈ మధ్యకాలంలో అదనపు కొవ్వును కరిగించుకోవడం అనేది చాలా కష్టతరమైన పనిగా మారిపోయింది. ఎక్కువగా యువత అధిక బరువుపారిన పడుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసేవారు అదే విధంగా తక్కువగా శారీరక శ్రమ చేసేవారు ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ చేసే సమయంలో కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా మీరు బరువు తగ్గవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.  

2 /8

ఊబకాయం నుంచి బయటపడాలంటే, శారీరక వ్యాయామంతో పాటు డైట్ అనేది తప్పనిసరి. సమతుల ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే మీరు ఉబకాయం నుంచి బయటపడతారు. ముఖ్యంగా తక్కువ కెలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ శక్తిని కరిగించడం ద్వారా మీరు ఊబకాయం నుంచి బయటపడవచ్చు.

3 /8

ఉదయం అల్పాహారంలో పండ్లు తినడం ద్వారా, మీరు శరీరంలో తక్కువ కెలరీ ఫుడ్ అందించవచ్చు. తద్వారా మీరు వేగంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. పండ్లతో పాటు గింజలు కొన్ని రకాల ఆకులను కూడా చేర్చుకోవచ్చు.  

4 /8

ఉదయం లేవగానే మొలకెత్తిన గింజలను తిన్నట్లయితే, మీ శరీరానికి కావలసిన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఇతర మైక్రో న్యూట్రియన్స్ శరీరానికి లభిస్తాయి. తద్వారా మీకు అదనపు కొవ్వు లభించదు ఫలితంగా మీరు బరువు పెరగరు.  

5 /8

కోడిగుడ్లను అల్పాహారంలో తీసుకోవడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కోడిగుడ్డులోని తెల్ల సొనను అల్పాహారంగా తీసుకోవడం ద్వారా మీకు కావాల్సిన ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి. రోజంతా మీకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. అలాగే మీకు ఆకలి అవ్వకుండా నిరోధిస్తుంది.  

6 /8

ఉదయం అల్పాహారంలో ఓట్స్ అనేది ఒక చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది ఇది శరీరంలో బరువు తగ్గించడం మాత్రమే కాదు. చెడు కొలెస్ట్రాల్ సైతం తగ్గిస్తుంది.  

7 /8

బాదం, జీడిపప్పు, వాల్ నట్ వంటి డ్రైఫ్రూట్స్ ను మీరు ఉదయం పూట తినడం వల్ల పెద్ద మొత్తంలో ప్రోటీన్లను పొందవచ్చు. తద్వారా మీకు రోజంతా ఆకలి బాధ నుంచి విముక్తి లభిస్తుంది తద్వారా మీరు బరువు పెరగరు.  

8 /8

ఉదయం పెరుగు తినడం ద్వారా కూడా మీరు బరువును నియంత్రించుకోవచ్చు. ఇది మీకు ఆశ్చర్యకరం అనిపించవచ్చు. కానీ ఉదయం పూట పెరుగు తినడం వల్ల మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుంది. తద్వారా మీకు రోజంతా శక్తి లభిస్తుంది.