Bhavani Deeksha: దసరా ముందు భవానీ దీక్షతో శుభం.. 11 రోజుల కఠిన దీక్షతో అమ్మవారి కటాక్షం 

Bhavani Deeksha 2024 Special: దసరా ముందు భవానీ దీక్ష ప్రారంభమవుతుంది. భవానీ మాలను కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రారంభించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రారంభమయ్యే ఈ దీక్షతో ఎంతో మేలు జరుగుతుంది. ఈ దీక్షతో అమ్మవారి కటాక్షం కలుగుతుంది.

1 /9

దీక్ష ప్రత్యేకం: దసరా పండుగ ముందు భవానీ దీక్ష ప్రారంభమవుతుంది. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవానీ మాల చేపడతారు.

2 /9

నిత్యతో: ఈ దీక్ష 11 రోజుల పాటు కఠినంగా దీక్షను చేపట్టాల్సి ఉంది. అత్యంత నిష్టతో ఈ దీక్షను భక్తులు స్వీకరిస్తారు.

3 /9

అమ్మవారి అనుగ్రహం: భవానీ దీక్ష కోసం అత్యంత జాగ్రత్త పాటించాల్సి ఉంది. అమ్మవారి అనుగ్రహం పొందాలనుకునేవారు ఈ మాలను పొందుతారు.

4 /9

అమ్మవారి నామస్మరణ: మాల స్వీకరించిన సమయంలో నిత్యం అమ్మవారి నామస్మరణ చేయాలి. ఇతరులను పలకరించే ముందు 'భవానీ' అని పలకరిస్తారు.

5 /9

శక్తి స్వరూపిణి: భవానీ దీక్ష ధరించిన వారు కాషాయ వస్త్రాలు ధరిస్తారు. అత్యంత శక్తిస్వరూపిణిగా ఉన్న అమ్మవారు అనుగ్రహం కోసం ఈ దీక్షను చేపడుతారు.

6 /9

గ్రంథాలు: ఈ దీక్ష చేపడితే సకల ఫలాలు దక్కుతాయని హిందూ ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి.

7 /9

సంతాన ప్రాప్తి: మనో ధైర్యం.. అమ్మవారి కటాక్షం పొందేందుకు ఈ దీక్ష చేపడతారు. ఈ దీక్ష చేపడితే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందనే నమ్మకం ఉంది.

8 /9

నిత్యం పూజలు: 11 రోజుల కఠిన దీక్షలో ఉన్నంత కాలం అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేపడతారు. చివరి రోజు అమ్మవారి ఆలయానికి చేరుకుని దీక్ష విరమించుకోవాలి.

9 /9

దీక్ష విరమణ: దీక్ష స్వీకరించిన భక్తులు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను కూడా దర్శించుకుని అక్కడ దీక్ష విరమిస్తుంటారు.