Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు బారులు తీరుతారు. దేశ నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తలు విచ్చేస్తారు. దీనికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా విడుదల చేస్తుంది టీటీడీ. ఇది కాకుండా సర్వదర్శనం ఇతర ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉన్నాయి.
అయితే శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం ఇచ్చింది. తమిళ కార్తీక మాస ప్రకారం నిర్వహించే చక్ర తీర్థ ముక్కోటి పండుగ వచ్చేసింది. దీనికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేస్తోంది.
దీనికి సంబంధించి టిటిడి భక్తులకు ప్రకటన చేసింది. ముక్తి ప్రద తీర్ధాల్లో చక్రతీర్థం కూడా అత్యంత ముఖ్యమైనది. అందుకే ప్రతి ఏడాది దీన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు.
అయితే ఈ ఏడాది ఈసారి చక్రతీర్థ ముక్కోటి డిసెంబర్ 12వ తేదీ నిర్వహిస్తున్నారు. చక్రతీర్థం శ్రీవారి ఆలయానికి దక్షిణ దిశలో పచ్చని అటవీ ప్రాంతంలో ఉంది ఇది ఎంతో విశేషమైనది.
శ్రీనివాసుడు తన చక్రయుధాన్ని ఇక్కడ విడిచి వెళ్ళాడని నమ్మకం ఉంది. అందుకే ఇది చక్రతీర్థం అయ్యిందని చెబుతారు. ఈ రోజు ఆ పుణ్య క్షేత్రంలో కొలువై ఉన్న నరసింహ స్వామి, ఆంజనేయ స్వామికి పూజలు చేస్తారు.
ఇదిలా ఉండగా 2025 జనవరి 10న 'ముక్కోటి ఏకాదశి' సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి 10 రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు. ఈ వేడుకలు జనవరి 10 నుంచి 19 తేదీ వరకు నిర్వహించనున్నారు.