YSRCP Joinings: టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి జంప్‌.. వైఎస్‌ జగన్‌ సమక్షంలో చేరిక

Mudunuri Murali Krishnam Raju Joins Into YSRCP: అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు వైఎస్సార్‌సీపీలో చేరడంతో చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన చేరడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఫుల్‌ జోష్‌ వచ్చింది.

1 /7

YSRCP Joinings: టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి జంప్‌.. వైఎస్‌ జగన్‌ సమక్షంలో చేరిక

2 /7

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ నాయకుడు పార్టీని వీడడం కలకలం రేపింది.

3 /7

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీ కృష్ణంరాజు టీడీపీకి రాజీనామా చేశారు. అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కూడా ఆయన ఉండడం గమనార్హం.

4 /7

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతోపాటు పెద్ద ఎత్తున నాయకులు, అనుచరులు కూడా పార్టీ కండువా మార్చుకున్నారు.

5 /7

అధికారంలో ఉన్న టీడీపీని వదిలేసి మురళీ కృష్ణంరాజు వైసీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ఆయన అనూహ్య నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేమిటనేది చర్చనీయాంశంగా మారింది.

6 /7

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రతినిధులతో వర్క్‌షాప్‌ నిర్వహించారు.

7 /7

వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పార్టీ ప్రతినిధులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం ఇచ్చారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x