Bigg Boss Updates: విడాకుల తరువాత బిగ్‌బాస్‌లోకి నటుడు ఎంట్రీ.. ఆయన మాజీ భార్య ఎవరో తెలుసా..!

Bigg Boss Show Latest Updates: తెలుగు, కన్నడలో సీరియల్స్‌లో పలు పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నారు నటుడు శిశిర్ శాస్త్రి. ఆయన ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇది తెలుగు బిగ్‌బాస్ కాదండోయ్. కన్నడ బిగ్‌బాస్ షో. ప్రస్తుతం తెలుగులో కూడా బిగ్‌బాస్ షో రన్ అవుతుండగా.. ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీలు అంటూ 8 మంది పాత కంటెస్టెంట్స్‌ను మళ్లీ హౌస్‌లోకి తీసుకువస్తున్నారు. 
 

1 /8

తెలుగు బిగ్‌ షో ఇప్పటికే మొదలై కొందరు కంటెస్టెంట్స్ కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అటు కన్నడ బిగ్‌బాస్ షో కూడా మొదలైపోయింది.  

2 /8

కిచ్చా సుదీప్ హోస్ట్‌గా గ్రాండ్‌గా షో ప్రారంభమైంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు శిశిర్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కి రావాలనేది తనకు చాలా ఏళ్ల కల అని చెప్పారు.   

3 /8

తాను పదమూడేళ్లుగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నానని.. ఈ 13 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా బిగ్‌బాస్ ఛాన్స్ దక్కిందన్నారు. తన కల నెరవేరిందన్నారు.  

4 /8

తాను వెజ్, నాన్ వెజ్ రెండూ వండుకుంటానని.. వంట చేయడం తనకు స్ట్రెస్ బస్టర్ లాంటిదన్నారు.   

5 /8

శిశిర్ శాస్త్రి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన తరువాత ఆయన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన పెళ్లి, విడాకులకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.   

6 /8

తనకు 33 ఏళ్లు అని ఇంకా పెళ్లి కాలేదని బిగ్‌బాస్‌ హౌస్‌లో శిశిర్ చెప్పారు. ఏదో సాధించాలని పట్టుదలతో వచ్చానని అన్నారు.   

7 /8

అయితే శిశిరకు అప్పటికే ఓ నటితో వివాహమైందని.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ నటి పేరు కోలి రమ్య. ఈమె కూడా తెలుగులో పలు సీరియల్స్‌తో పాపులారిటీ సంపాదించుకున్నారు.  

8 /8

ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కోలి రమ్య ఓ డ్యాన్సర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.