BSNL Cheapest Recharge Plan: ప్రభుత్వ రంగ కంపెనీ ఆయన భారత్ సంచార నిగం లిమిటెడ్ (BSNL) కస్టమర్లకు కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తూ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది జియో, ఎయిర్టెల్‌కు బిగ్ షాక్ ఇస్తోంది. బిఎస్ఎన్ఎల్ ఈరోజు మీ ముందుకు చీపెస్ట్ రీఛార్జీప్లాన్‌ను తీసుకువచ్చింది. కేవలం రూ. 91 తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వాలిడిటీ అందుతుంది ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల పట్ల వరంల మారింది. కొత్త ఆఫర్లను అతి తక్కువ ధరల్లోనే పరిచయం చేస్తూ కస్టమర్లకు భారీ ఊరట అందిస్తుంది. పెరిగిన టెలికాం ధరల తర్వాత బిఎస్ఎన్ఎల్‌కు అందుకే చాలామంది పోర్ట్ అయ్యారు.
ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ 4g, 5g సేవలు విస్తరణ దిశగా కూడా అడుగులు వేస్తుంది. టవర్లు ఏర్పాటు కూడా ఊపందుకుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది మొబైల్ యూజర్స్ ఆకర్షితులవుతున్నారు.
ఈరోజు రూ.91 తో అతి తక్కువ ధరలో బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకుని అవకాశం కల్పిస్తోంది. ఈ ప్లాన్ తో 90 రోజుల వ్యాలిడిటీ మీకు అందుతుంది.. నెలవారీ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీకు ఇన్కమింగ్ కాల్స్, మెసేజెస్ కూడా అందుకుంటారు.
టెలికాం ధరలు ఎక్కువగా పెరగడంతో చాలామంది రీచార్జ్ చేసుకోలేక సిమ్ కార్డులు డీయాక్టివేట్ అయిపోతున్నాయి. అలాంటి వారికే బిఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ అందుతుంది.
ఈ ప్లాన్ డేటా, కాల్స్ ఎక్కువగా ఉపయోగించలేని వారికి సరిపోతుంది. కేవలం ఇన్కమింగ్ కాల్స్ పొందవచ్చు. ఈ బిఎస్ఎన్ఎల్ రూ.91 రోజుల రీఛార్జ్ ప్లాన్ మార్కెట్లో ఏ దిగ్గజ కంపెనీ అందించడం లేదు.
రూ.91తో రీఛార్జీ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ సెకండ్ సిమ్ ఉపయోగించేవారికి సరిపోతుంది. ముఖ్యంగా ధరలు ఎక్కువ ఉండటంతో చాలామంది సెకండ్ సిమ్ రీచార్జ్ చేసుకోలేరు. కాబట్టి ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 3 నెలల వాలిడిటీ వస్తుంది. ఒకవేళ మీరు ఈ సెకండ్ సిమ్‌తో ఫోన్ చేయాలనుకుంటే టాప్ అప్ ప్లాన్ ఏదైనా ఉపయోగిస్తే సరిపోతుంది.