Tirumala: తెలంగాణ నేతలకు భారీ శుభవార్త.. శ్రీవారి దర్శనం సిఫారులపై చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం.. డిటెయిల్స్..

Chandrababu naidu: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ నేతల సిఫారసు లేఖల అంశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
 

1 /6

తిరుమల శ్రీవారిని భక్తుు కొంగు  బంగారంగా భావిస్తారు. అదే విధంగా ఎంతోదూరం నుంచి వచ్చి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో  ఎన్నిగంటలైన వేచీ చూస్తుంటారు.  

2 /6

ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరచుగా శ్రీవారి దర్శనం కోసం భక్తులకు అనేక సిఫారసుల లేఖలు ఇస్తుంటారు.  దీంతో స్వామి వారి దర్శనం కాస్త తొందరగా అవుతుందని చెప్పుకొవచ్చు.  

3 /6

ఈ క్రమంలో ఈ రోజున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల దర్శనంపై పలు అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తొంది.  

4 /6

దీనిలో ముఖ్యంగా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వారానికి రెండు సిఫార్సు లేఖలకు ఏపీ సీఎం అంగీకారం తెలిపినట్లు తెలుస్తొంది.

5 /6

అదే విధంగా వీక్లీ.. రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు అనుమతిని ఇచ్చినట్లు తెలుస్తొంది.

6 /6

అంటే మొత్తంగా రెండు లేఖలు బ్రేక్ దర్శనం మరో రెండు మూడు వందల రూపాయల టికెట్ల మీద ప్రజాప్రతినిధులు సిఫారసులు ఇవ్వొచ్చని తెలుస్తొంది. ఈమేరకు ఏపీ సర్కారు, టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.