Sai pallavi phone number controversy: అమరన్ మూవీ చుట్టు తరచుగా ఏదో ఒక కాంట్రవర్షీ ఘటనలు వార్తలలో ఉంటునే ఉన్నాయి. తాజాగా, మళ్లీ ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది.
సాయి పల్లవి, శివకార్తీకేయర్ జంటగా చేసి అమరన్ మూవీ ఒక సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. పుల్వామ దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరక్కెంది.
ఈ మూవీ ఆది నుంచి ఏదో ఒక అంశంతో వివాదాల్లో ఉంటుంది.. ఈ మూవీలో ఇందు రెబక్కా వర్గీస్ పాత్రలో నటించిన సాయి పల్లవిని నెటిజన్ లు ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ మూవీలు నడుస్తున్న కొన్ని థియేటర్ లపై ఇటీవల పెట్రోల్ బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ మూవీపై ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అమరన్ చిత్రయూనిట్ కు.. ఏకంగా రూ. 1 కోటి తనకు నష్ట పరిహరంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
చెన్నైకు చెందిన కాలేజ్ స్టూడెంట్ అయిన వగీసన్ తన ఫోన్ నంబర్ ఈ మూవీలో సాయి పల్లవి ఫోన్ కాల్ అంటూ చూపించారని... దీంతో మూవీ టీమ్ కు ఈ విషయం తెలిసిలా చేశారన్నారు. కానీ వాళ్లు పట్టించుకోలేదని దాని వల్ల.. సాయి పల్లవి ఫ్యాన్స్ నుండి వస్తున్న కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని ఆవేదన చెందాడు.
కనీసం నిముషాలు కూడా గ్యాప్ లేకుండా ఫోన్ ల మీద ఫోన్స్ చేసి టార్చర్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన ఫ్యామిలీ, పర్సనల్ పనులు కూడా చేసుకొలేని పరిస్థితి ఏర్పడిందని కూడా.. సదరు యువకుడు బాధపడినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో.. అతను లీగల్ గా ముందుకు వెళ్లినట్లు తెలుస్తొంది.
తనకు కల్గిన అసౌకర్యానికి అమరన్ మూవీ టీమ్.. రూ. 1 కోటి నష్టపరిహారంగా కావాలని పేర్కొన్నాడు. ఇక వగీసన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ‘అమరన్’ టీమ్ ఇంకా స్పందించలేదని సమాచారం.