Best Tourist Places in South India During Christmas: ఇంకో వారం రోజుల్లో క్రిస్మస్ హాలీడేస్ రాబోతున్నాయి. ఈ క్రిస్మస్ తోపాటు న్యూఇయర్ కూడా రాబోతోంది. దీంతో వరుసగా సెలవులు వస్తాయి. మీరు ఈ క్రిస్మస్ అండ్ న్యూఇయర్ కోసం ఎక్కడికైనా ట్రిప్ వేయాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతాలు చాలా బాగుంటాయి. ట్రావెంలింగ్ లో క్రిస్మస్ సందడి కూడా చూడటానికి చాలా బాగుంటాయి. అలాంటి ఐదు టాప్ ప్లేస్ ల గురించి తెలుసుకుందాం.
చెన్నై తమిళనాడు రాజధాని చెన్నైలో క్రిస్మస్ బాగా జరుపుకుంటారు. అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. వెలంకనీ చర్చ్, షాంతోమ్ చర్చ్ తోపాటు మరిన్ని ఫేమస్ చర్చిలు ఈ సిటీలో ఉన్నాయి.వీటిడెకరేషన్ చాలా బాగుంటుంది. క్రిస్మస్ మార్కెట్ కూడా చెన్నై సిటీలో బాగుంటుంది.
అలెప్పి: క్రిస్మస్ కు దక్షిణ భారతదేశంలోని ఏదైనా అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించాలంటే, చాలా మంది ప్రజలు ముందుగా అలెప్పి చేరుకుంటారు. కేరళలోని అలెప్పీ దక్షిణ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అలెప్పీ దాని అందమైన బీచ్లు, బ్యాక్ వాటర్లు, మడుగులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలెప్పీ అందాలను చూసి వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. అలెప్పిలో మీరు అలెప్పీ బీచ్, అలెప్పి బ్యాక్ వాటర్స్, కుమరకోమ్ బర్డ్ శాంక్చురీ, కుట్టనాడ్, వెంబనాడ్ సరస్సు వంటి అద్భుతమైన ప్రదేశాలను అన్వేషించిన తర్వాత ఆనంద పారవశ్యంలో ఉంటారు. క్రిస్మస్ సమయంలో అలప్పీలో సందడి బాగుంటుంది. స్టార్లు, లైట్లతో కళ్లు మిరుమిట్లు కొలిపేలా ఇల్లను అందంగా అలంకరిస్తారు. అందుకే క్రిస్మస్ సమయంలో చాలా మంది అలప్పీ వెకేషన్ కు వెళ్తుంటారు. కేరళా అంతటా కూడా క్రిస్మస్ సందడి అదిరిపోతుంది.
పాండిచ్చేరి క్రిస్మస్ సమయంలో వెళ్లేందుకు పాండిచ్చేరి కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ చాలా పాపులర్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. పండగ సమయంలో ఇక్కడికి వెళ్తేఫ్రెంచ్ కల్చర్, వారి విధానాలను చూసే ఛాన్స్ ఉంటుంది. పాండిచ్చేరిలో పురాతన కట్టడాలు, రంగరంగుల నిర్మాణాలు, బీచ్లు, కేప్ లు ఇలా చాలా ఆకట్టుకుంటాయి. బీచ్ చాలా ఆహ్లాదకరంగాఉంటుంది. చర్చిలు కూడా పాండిచ్చేరిలో ఎక్కువగా ఉంటాయి.
గోవా గోవాలోని క్రిస్మస్ సంబురాలు బాగా జరుగుతాయి. ఇక్కడ చర్చిలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ క్రిస్మస్ పార్టీలు, ఫెస్టులు ప్రత్యేకంగా జరుగుతాయి. అందమైన బీచుల్లో సమయం గడిపే అవకాశం ఉంటుంది. నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేయవచ్చు. క్రిస్మస్ సందర్భంగా గోవా స్ట్రీట్స్ వెలుగులతో మిరమిట్లు కొలుపుతుంటాయి. బేకరీల్లో స్పెషల్ కేక్స్ కూడా ఉంటాయి.
క్రిస్మస్ వచ్చిందంటే చాలు కొచ్చి వెలిగిపోతుంది. ఈ సిటీలో ఈనెల చివరి వారంలో జరిగే కొచ్చి కార్నివల్ ఎంతో ఆకట్టుకుంటుంది. కళ్లు చెదిరే ఈవెంట్స్, ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్, పలు కల్చర్స్ అద్దం పట్టే కార్యక్రమాలు ఇలా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. బైక్ రేస్ లు, బీచ్ ఫుట్ బాల్, బాక్సింగ్, సైకిల్ రేస్ ఇలా చాలా రకాల ఆటలు జరుగుతుంటాయి. ఫుడ్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి. ఇలా వారమంతా కొచ్చి కార్నివల్ లో సందడి భారీ స్థాయిలో ఉంటుంది. ఫ్రాన్సిస్ చర్చి, సెయింట్ జార్జ్ లాంటి పురాతన చర్చిలు ఎన్నో ఉన్నాయి.