2024 Top 10 Highest Gross Movies: 2024లో మన దేశ బాక్సాఫీస్ (విదేశీ వసూల్లు కాకుండా) దగ్గర అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు. అందులో కల్కి నుంచి దేవర వరకు ఏయే సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించాయో చూద్దాం..
1. కల్కి 2898 AD - ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీ మన దేశ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు రూ. 777 కోట్ల గ్రాస్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
2. స్ట్రీ 2 - శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్త్రీ 2’ మూవీ మన దేశ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు రూ 707 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం.
3. దేవర పార్ట్ 1 - ఎన్టీఆర్ హీరోగా జాన్వీకపూర్ హీరోయిన్ గా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మన దేశ బాక్సాఫీస్ దగ్గర రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్ట.
4. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ - విజయ్ ద్విపాత్రాభినయంలో విక్రమ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ ఈ చిత్రం ఓన్లీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 293 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
5. ఫైటర్ - హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొణే హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఫైటర్’ చిత్రం ఓన్లీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 243 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
6. హను-మాన్ - ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 240 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
7. షైతాన్ - అజయ్ దేవ్ గణ్, మాధవన్ హీరోలుగా జ్యోతిక ముఖ్యపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 178 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
8. మంజుమ్మెల్ బాయ్స్ - మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మన దేశంలోనే రూ. 170 కోట్లు వసూళ్లు చేసాయి.
9. వెట్టయన్ - రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు మన దేశ బాక్సాఫీస్ దగ్గర రూ. 165 కోట్లు వసూళు చేసాయి.
10. గుంటూరు కారం - త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మన భారత దేశ బాక్సాఫీస్ దగ్గర రూ 142 కోట్లు వసూళు చేసింది.