Devendra Fadnavis Profile: రెండు సార్లు సీఎం.. ఒక సారి డిప్యూటీ సీఎం.. అదిరిపోయే దేవేంద్ర ఫడణవీస్ పొలిటికల్ ప్రొఫైల్..

Devendra Fadnavis Profile: మరాఠా రాజకీయాల్లో మేరు నగధీరులను ఎదర్కొని నిలబడ్డ నేత దేవేంద్ర ఫడణవీస్. అంతేకాదు మహారాష్ట్రను ఐదేళ్లు నిరాటంకంగా పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు. రెండోసారి కేవలం 5 రోజులు మాత్రమే సీఎం. కట్ చేస్తే .. ఏక్ నాథ్ షిండే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పర్సనల్ ప్రొఫైల్ విషయానికొస్తే..

1 /8

Devendra Fadnavis Profile:దేవేంద్ర ఫడణవీస్.. 22 జూలై 1970 మహారాష్ట్రలో విదర్భ ప్రాంతానికి చెందిన నాగ్ పూర్ లో జన్మించారు. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఫడణవీస్.. ఈ గురువారం మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

2 /8

తాజాగా మహా రాష్ట్రలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకోవడానికి కేంద్ర పెద్దలు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీని పరిశీలకులుగా పంపించారు. వాళ్ల ఆధ్వర్యంలో  మహారాష్ట్రలో బీజేపీ తరుపున ఎన్నికైన ఎమ్మెల్యేలు దేవేంద్ర ఫడణవీస్ ను తమ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. రేపు సీఎంగా ప్రమాణం చేయడం లాంఛనమే.

3 /8

క్రియాశీలా రాజకీయాల్లో రాకమునుపే  ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారు. ఆ తర్వాత 1997-2001 మధ్య 27 యేళ్ల చిన్న వయసులో నాగ్ పూర్ మేయర్ ఎక్నికై సంచలనం రేపారు.

4 /8

11 ఏప్రిల్ 2013 నుంచి 6 జనవరి 2015 వరకు దాదాపు యేడాదిన్నర వరకు మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 నుంచి నాగ్ పూర్ పశ్చిమం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక 2014లో మహారాష్ట్రలో గెలిచిన తర్వాత ఆ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

5 /8

మహారాష్ట్రలో ఒక టర్మ్ మొత్తంగా ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా దేవేంద్ర ఫడణవీస్ రికార్డు క్రియేట్ చేసారు. 31 అక్టోబర్ 2014 నుంచి 12 నవంబర్ 2019 వరకు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.  ఆ తర్వాత 2019లో 23 నవంబర్ నుంచి 28 నవంబర్ వరకు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం 5 రోజులకే ఫడణవీస్  రాజీనామా చేయాల్సి వచ్చింది.

6 /8

అయితే.. అప్పట్లో శివసేన ..కాంగ్రెస్, ఎన్సీసీలతో  కలిసి మహా వికాప్ అఘాడీగా ఏర్పడి ఉద్దవ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువైంది. అపుడు మహారాష్ట్ర ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు.

7 /8

ఆ తర్వాత శివసేనలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో చీలిక తీసుకొచ్చారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన మహాయుతిగా ఏర్పడి కూటమిలో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి చేయడంలో కీలక భూమిక పోషించారు. ఆయన మంత్రివర్గంలో తన స్థాయి తగ్గించుకొని ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

8 /8

2024 లోక్ సభ ఎన్నికల్లో మహా యుతి దెబ్బ తిన్నా.. అసెంబ్లీ ఎన్నికల వరకు పుంజుకొని గోడకు కొట్టిన బంతిలా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు దేవేంద్ర ఫడ్నవీస్. ఇపుడు మహారాష్ట్రకు మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.