Diabetes Control Tips: డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. ఈ సమస్యతో బాధపడేవారు వాళ్ళ ఆహార పదార్థాల ఎంపికలో ఎన్నో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది, లేదంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని సహజమైన పద్ధతులు ఉన్నాయి.
ప్రస్తుతం షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య భారత దేశంలో ఎక్కువగా ఉందని కొన్ని అధ్యాయంలో తేలింది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ ని కంట్రోల్ చేయకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఎల్లప్పుడూ షుగర్ ని అదుపు ఉంచడం చాలా అవసరం. అలాగే దీనికి సంబంధించిన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.
అయితే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి మన ఇంట్లో దొరికే కొన్ని సుగంధ ద్రవ్యాలు ఎంతో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉండే విటమిన్లు మన షుగర్ వ్యాధిని వెంటనే నియంత్రణ చేస్తాయి.
వాము: ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వాము నీరు తాగడం వల్ల జీర్ణశక్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే డయాబెటిస్ సంబంధించిన సమస్యల బారిన పడకుండా ఉంటాము.
లవంగాలు: లవంగాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే సుగంధ ద్రవ్యం. ప్రతిరోజు రెండు లవంగాలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఇన్సులిన్ నియంత్రించడంలో సహాయపడుతుంది.
జీలకర్ర: జీలకర్ర కేవలం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలోనే కాకుండా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా దీని తాగవచ్చు.
మెంతులు: మెంతులు గొప్ప ఆరోగ్య పదార్థం. కాళీ కడుపుతో మెంతులు నీళ్లు తాగడం వల్ల ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను తగ్గించడంలో ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్క శరీరానికి సహాయపడే ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉపయోగించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గడంలో రక్తపోటుని నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
గమనిక: ఇక్కడ చెప్పిన సందేశం కేవలం సమాచారం మాత్రమే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆరోగ్య నిపుణుని సంప్రదించడం మంచిది.