Jyothika Half-sister Nagma: నటి జ్యోతికా గురించి.. అందరికీ తెలుసు. కానీ ఆమెకి ఒక సోదరి ఉంది అనే విషయం తక్కువ మందికే గుర్తుంటుంది. ఆమె ఒక ప్రముఖ కన్నడ నటి కూడా. రవిచంద్రన్, శివన్న వంటి స్టార్ లతో.. కలిసి నటించిన ఆ అందాల తార ఇప్పటికీ 49 ఏళ్ల వయసులో కూడా ఇంకా సింగిల్ గానే ఉన్నారు.
స్టార్ నటి జ్యోతిక సరవణన్ గురించి తెలియని వారు ఉండరు. నటిగా మాత్రమే కాక నిర్మాతగా కూడా జ్యోతిక తమిళ సినిమాలతో పాటు తెలుగు, మలయాళం హిందీ సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 50కి పైగా సినిమాల్లో నటించిన జ్యోతిక జాతీయ సినిమా అవార్డు కూడా అందుకున్నారు. సూర్య భార్యగా అందరికీ తెలుసు కానీ ఆమె తల్లిదండ్రులు గురించి తక్కువ మందికే తెలుసు.
జ్యోతిక తండ్రి పంజాబీ హిందూ.. తల్లి ముస్లిం. ఆమె తండ్రి చందర్ సదానా నిర్మాతగా పనిచేసేవారు. ఆమె తల్లి సీమా సదానా. చందర్ కంటే ముందు సీమ అరవింద్ మోరార్జి ని పెళ్లి చేసుకున్నారు కానీ కొన్నేళ్ళకి విడాకులు తీసుకున్నారు. వారికి పుట్టిన సంతానమే నగ్మా. అంటే నగ్మా జ్యోతికకు అక్క అవుతుంది అన్నమాట.
1990లలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నగ్మా, సల్మాన్ ఖాన్ సరసన బాఘి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఆ సంవత్సరం హిందీ సినిమాలో ఏడవ హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాగా విజయం సాధించింది.
హిందీ, తమిళం, భోజ్ పురి భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన నగ్మా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. బాషా, కొండపల్లి రాజా, ఘరానా మొగుడు, రీక్షావోడు, ప్రేమికుడు ఇలా చాలా సినిమాల్లో అప్పట్లో స్టార్ హీరోలు అందరితో నటించింది నగ్మా.
మలయాళం, కన్నడ, బెంగాళీ, పంజాబీ, మరాఠీ వంటి పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లో కూడా కనిపించిన ఈ భామ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలతో బిజీగా ఉంది. కాంగ్రెస్ తరపున ఎన్నికలలో పాల్గొన్న నగ్మా 2015 లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ (AIMC) కి జనరల్ సెక్రటరీ గా కూడా పనిచేశారు.