Dry Skin Problem: డ్రై స్కిన్‌కు విటమిన్ లోపం కారణమా, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి

చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. చర్మం తరచూ డ్రై అయిపోతుంటుంది. అయితే బహుశా ఇది వాతావరణం వల్ల కాదు. శరీరంలో కొన్ని పోషకాల లోపంతో జరుగుతుంటుంది. ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ ఎ లోపముంటే చర్మం తేమ కోల్పోతుంది. వృద్ధాప్య లక్షణాలు కూడా ఎదురౌతాయి. అయితే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Dry Skin Problem: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. చర్మం తరచూ డ్రై అయిపోతుంటుంది. అయితే బహుశా ఇది వాతావరణం వల్ల కాదు. శరీరంలో కొన్ని పోషకాల లోపంతో జరుగుతుంటుంది. ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ ఎ లోపముంటే చర్మం తేమ కోల్పోతుంది. వృద్ధాప్య లక్షణాలు కూడా ఎదురౌతాయి. అయితే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

1 /6

అవకాడో అవకాడోలో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవే చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. డ్రై నెస్ దూరం చేస్తాయి.

2 /6

క్యారట్ క్యారట్‌లో విటమిన్ ఎ పెద్దఎత్తున ఉంటుంది. క్యారట్‌ను సలాడ్ లేదా జ్యూస్ లేదా కూరగాయల రూపంలో తీసుకోవచ్చు. చర్మం హైడ్రేట్‌గా ఉంచవచ్చు

3 /6

వాల్‌నట్స్ - బాదం వాల్‌నట్స్, బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. 

4 /6

సన్‌ఫ్లవర్ సీడ్స్ సన్‌ఫ్లవర్ సీడ్స్‌ లో విటమిన్ ఇ పెద్దఎత్తున ఉంటుంది. స్నాక్స్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

5 /6

పాలకూర పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఎ, విటమిన్ ఇ పెద్దఎత్తున ఉంటుంది. చర్మానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి

6 /6

విటమిన్ ఇ-విటమిన్ ఎ అవసరం విటమిన్ ఇ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. అవసరమైన పోషకాలు అందిస్తుంది. విటమిన్ ఎ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.