Easy Earn Money Tips: వేసవిలో ఈ వ్యాపారాలు చేయండి.. మీ ఇంట డబ్బుల వర్షం కురవడం ఖాయం

Summer Business Ideas: మీకు బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే.. ఈ హాట్‌ సమ్మర్‌లో కూల్‌గా సంపాదించుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఎలా ఆదాయం సంపాదించాలో తెలుసుకోండి. పూర్తి వివరాలు ఇలా.. 
 

  • Apr 18, 2023, 23:26 PM IST
1 /5

వేసవి కాలంలో ప్రజలు చల్లటి పదార్థాలు సేవించేందుకు మక్కువ చూపుతారు. సమ్మర్‌లో ప్రత్యేకంగా అనేక వ్యాపారాలు పుట్టుకొస్తాయి. మీరు కూడా ఇలాంటి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకోవచ్చు.  

2 /5

కూల్‌డింక్స్ బిజినెస్ చేసి ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. సమ్మర్‌లో శీతల పానీయాలకు భారీ డిమాండ్ ఉంటుంది. వ్యాపారం బాగా జరిగితే.. నెలలో కనీసం 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. జనం రద్దీ ఎక్కువగా ఉంటే ప్లేస్‌లో వ్యాపారం మొదలు పెడితే.. మీ ఇంట సిరుల పంట కురువడం ఖాయం.   

3 /5

సమ్మర్‌లో ఎక్కువ మంది లస్సీ, మజ్జిగ తాగడానికి ఇష్టపడతారు. చాలా శరీరానికి చల్లదనం అందించడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వ్యాపారం చాలా తక్కువ డబ్బు పెట్టుబడి ప్రారంభించవచ్చు. లస్సీ, మజ్జిగ అమ్మడం ద్వారా రోజుకు రూ.1000 నుంచి 1500 వరకు సంపాదించుకోవచ్చు.  

4 /5

వేసవి కాలంలో చాలామంది జ్యూస్‌ వైపు కూడా ఆకర్షితలవుతారు. ఈ జ్యూస్ బిజినెస్ చేస్తే రోజుకు రూ.500 నుంచి 800 వరకు లేదా అంతకంటే ఎక్కువగా కూడా సంపాదించవచ్చు..    

5 /5

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సమ్మర్‌లో తప్పకుండా తినేది ఐస్‌క్రీమ్. హీట్ ఎంత పెరిగితే.. ఐస్ క్రీమ్‌ బిజినెస్‌కు అంత డిమాండ్ ఉంటుంది. ఐస్ క్రీమ్ వ్యాపారం ద్వారా నెలకు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు సంపాదించవచ్చు.