Andeka Achar: కోడి గుడ్డును ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంతో తింటుంటారు. దీని వల్ల శరీరంకు అదనపు ఎనర్జీ వస్తుందని చెప్తుంటారు. అయితే.. కోడిగుడ్డు కారం ఎలా చేయలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది తరచుగా అన్నం తినేటప్పుడు ఏదో ఒక ఆవకాయను తప్పనిసరిగా తింటుంటారు. మామిడికాయ, దోసకాయ, మిర్చి, నేరపండ్లు, ఉసిరి ఇలా రకరకాల వాటితో ఆవకాయలు చేసుకుంటారు. వెల్లుల్లీతో ఆవకాయల్ని చేసుకుంటారు.
అయితే..ప్రస్తుతం కోడి గుడ్డు ఆవకాయను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడి గుడ్డును అందరు ఎంతో ఇష్టంతొ తింటారు. కోడి గుడ్డు ఆవకాయను చేసేటప్పడు కొన్ని పదార్థాలను ముందుగానే రెడీ చేసుకొవాలి. కారం, ఉప్పు, వెల్లుల్లీ పేస్ట్, జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడులను రెడీగా పెట్టుకొవాలి.
ఆ తర్వాత కోడి గుడ్డులను తొలుత కుక్కర్ లో వేసుకొవాలి. దానిలో నీళ్లు పోసి.. కాస్తంత ఉప్పు కూడా వేయాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గుడ్లను చల్లని నీళ్లలో వేయాలి. ఆ గుడ్లకు ఉన్న పెంకుల్ని తీసేయాలి.
ఒక కడయ్ తీసుకుని దానిలో నూనె వేసి.. వేడి అయ్యేవరకు చూడాలి. ఆ తర్వాత.. దానిలో.. ఆవాలు, జీలకర్ర, మిర్చి, వెల్లుల్లీ పెస్ట్ లను వేయాలి. దీనిలో గుడ్లను వేసి.. స్పూన్ తో వేయించాలి. దీనిపైన కారం పొడి చల్లి.. ఎర్రగా అన్ని వైపులా కలిసే విధంగా వేయించాలి.
తెల్లగా ఉన్న గుడ్డు కాస్త.. ఎర్రగా ఒక లేత రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ఐదునిముషాల్లో ఆవాకాయ గుడ్డు రెడీ అయిపోయిపోతుంది. అయితే.. ఈ ఆవాకాయ ఎక్కువ రోజులు నిల్వఉండదని చెప్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు చేసుకుంటూటెస్టీగా ఉంటుంది. దీనిలో నిమ్మరసం కల్పుకుంటే.. ఇంకా ఆవకాయ ఇంకా టెస్టీగా ఉంటుందని చెప్తుంటారు.