Kalki 2898 AD Record: నెల రోజులైన బాక్సాఫీస్ దగ్గర తగ్గని ‘కల్కి’ హవా.. బుక్ మై షోలో ప్రభాస్ రికార్డుల మీద రికార్డులు..

Kalki 2898 AD Record: నెల రోజులైన బాక్సాఫీస్ దగ్గర తగ్గని రెబల్ స్టార్ ‘కల్కి’ హవా విడుదలై నెల రోజులు పూర్తి కావొస్తున్న ఈ సినిమా తాజాగా 31వ రోజు ఈ సినిమా  బుక్ మై షోలో ప్రభాస్ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పింది.

1 /5

రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే.. ఎలా ఉంటుందో తాజాగా ‘కల్కి 2898 AD’మూవీతో ప్రూవ్ అయింది. ఇప్పటికే బుక్ మై షోలో ఈ సినిమా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది.

2 /5

తాజాగా కల్కి మూవీ 30వ రోజు బుక్ మై షోలో దాదాపు 35 వేలకు పైగా టిక్కెట్స్ తెగాయి. తాజాగా 31వ రోజు శనివారం రోజున ఈ సినిమా దాదాపు 64 వేల టికెట్స్ తో సంచలనం రేపింది. ఈ మధ్యకాలంలో ఓ సినిమా నెల రోజుల తర్వాత కూడా ఈ రేంజ్ లో వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు.

3 /5

అంతేకాదు కల్కి మూవీ నైజాం (తెలంగాణ) గడ్డ పై ఈ సినిమా రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు ఈ సినిమా తెలంగాణలో రూ. 93 కోట్ల షేర్ రాబట్టి ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతూనే ఉంది.

4 /5

‘కల్కి 2898 AD’ సినిమా ఇప్పటి వరకు రూ. 1175 కోట్ల గ్రాస్ (రూ. 570 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఈ రోజు ఆదివారం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. మరోవైపు రేపు సోమవారం హైదరాబాద్ లో బోనాల సెలవు కల్కి మూవీకి కలిసొచ్చే అవకాశాలున్నాయి.

5 /5

మొత్తంగా మీద అన్ సీజన్ లో విడుదలైన ‘కల్కి’ మూవీ కంటెంట్ ఉంటే.. ఏ సీజన్ అయినా.. బాక్సాఫీస్ దగ్గర వసూల్లతో కుమ్మేయచ్చని ఈ సినిమా ప్రూవ్  చేసింది.