Food Safety Rides: వీలైనా కప్పు కాఫీ వద్దు..కుదిరినా డిన్నర్ వద్దు..గచ్చిబౌలిలో ఈ రెస్టారెంట్లో తింటే డైరెక్ట్ యముడి దగ్గరకే

Food Safety Rides:హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా గచ్చిబౌలిలోని పలు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ పై అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి కిచెన్ల పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఫ్రిడ్జ్ లో కుళ్లిపోయిన చికెన్, ముందురోజు బిర్యానీ వేడి చేసి ఇవ్వడం, కిచెన్ లో బొద్దింకలు పారడం ఇవ్వన్నీ చూసిన అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. 
 

1 /6

Food Safety Rides: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ హోటల్స్ లో ఏమాత్రం సుచీశుభ్రత పాటించడం లేదు. 

2 /6

కిచెన్లలో ఎలుకలు, బొద్దింకలు కంపు వాసన, అధ్వాన్న పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. అలాంటి హోటల్స్ భోజనం చేస్తే హాస్పిటల్ కాదు డైరెక్ట్ నరకానికే వెళ్లడం ఖాయమనే దారుణ ఘటనలు బహిర్గతమవుతున్నాయి.

3 /6

గడువు ముగిసిన ఫుడ్ ఐటమ్స్, ప్రమాదకర కలర్ ఫుడ్స్, చాలా రోజులుగా ఫ్రిజ్ లో స్టోర్ చేసిన ఫుడ్స్ ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులకు పట్టుపడ్డాయి.   

4 /6

తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని పలు ప్రముఖ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ లేకుండా కాసులకు కక్కుర్తి పడి ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. 

5 /6

 వీ ఎన్ రోజ్(  𝗟𝗮 𝗩𝗶𝗲 𝗘𝗻 𝗥𝗼𝘀𝗲 𝗖𝗮𝗳𝗲, 𝗜𝗻𝗱𝗶𝗿𝗮 𝗡𝗮𝗴𝗮𝗿, 𝗚𝗮𝗰𝗵𝗶𝗯𝗼𝘄𝗹𝗶), బెర్లిన్ రెస్టారెంట్ అండ్ క్లబ్ (𝗕𝗲𝗿𝗹𝗶𝗻 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁 𝗮𝗻𝗱 𝗖𝗹𝘂𝗯, 𝗔𝘁𝗿𝗶𝘂𝗺 𝗠𝗮𝗹𝗹, 𝗚𝗮𝗰𝗵𝗶𝗯𝗼𝘄𝗹𝗶),  ది నవాబ్ రెస్టారెంట్ (𝗧𝗵𝗲 𝗡𝗮𝘄𝗮𝗮𝗯𝘀 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁, 𝗚𝗮𝗰𝗵𝗶𝗯𝗼𝘄𝗹𝗶), ఈ హోటల్స్ నిర్వహించిన తనిఖీల్లో బిర్యానీని ఫ్రిడ్జ్ లోని స్టోర్ చేసి..మరుసటి రోజు వేడి చేసి వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

6 /6

అంతేకాదు నల్లని గ్రీజు నూనె కూడా దొరికింది. ఆ నూనెతో వండిన వంటకాలు తింటే క్యాన్సర్ వస్తుందని, హానికర రోగాలకు దారి తీస్తాయని అధికారులు హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు. అంతేకాదు హోటల్స్ లో అపరిశుభ్రత, ఇతర లోపాలను కూడా గుర్తించారు. ఈ మేరకు రెస్టారెంట్ల యజమానులు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశారు. ఈ విషయాన్ని ఫుడ్ సేప్టీ అధికారులు ట్విట్టర్ లో పోస్టు కూడా చేశారు.