Game Changer WW Pre Release Business: ‘గేమ్ ఛేంజర్’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రామ్ చరణ్ ముందు కొండంత టార్గెట్..

Game Changer WW Pre Release Business: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ  ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే రిలీజై  ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చేసిన  ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..

1 /6

Game Changer WW Pre Release Business: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో  యాక్ట్ చేసిన చిత్రం  ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరు మీదుంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చాయి ఆయా రాష్ట్రాలు.  

2 /6

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, హిందీలో విడుదలవుతోంది. ఇప్పటికే అమెరికా, ఏపీలో చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

3 /6

 ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ శంకర్ ట్రాక్ రికార్డు గత కొన్నేళ్లలో అంతగా బాగాలేదన్నారు. మొత్తంగా ఈ సినిమా భారం  రామ్ చరణ్ పైనే ఉంది. 

4 /6

రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సోలో చిత్రం ‘వినయ విధేయ రామ’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 77.94 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అటు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తెలుగు స్టేట్స్ లో రూ. 191 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అటు చిరంజీవితో చేసిన ‘ఆచార్య’ మూవీ రూ. 107.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.

5 /6

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)..రూ. 43.50 కోట్లు.. రాయలసీమ(సీడెడ్).. రూ. 23 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 14.20 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 10 కోట్లు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి.. రూ. 8.10 కోట్లు..కృష్ణా.. రూ. 8.50 కోట్లు.. గుంటూరు.. రూ. 10.20 కోట్లు.. నెల్లూరు.. రూ. 4.50 కోట్లు.. తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్.. రూ. 25 కోట్లు.. కర్ణాటక.. రూ. 14.50 కోట్లు.. తమిళనాడు..రూ. 15 కోట్లు.. హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 42.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /6

తాజాగా రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇక తెలుగు స్టేట్స్ లో క్లీన్ హిట్ అవ్వాలంటే .. రూ. 124 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి సంక్రాంతి భారీ పోటీలో ‘గేమ్ చేంజర్’ ఈ టార్గెట్ ను అందుకుంటాడా లేదా అనేది చూడాలి.