Gold Rate Today 15th July 2021: బులియన్ మార్కెట్ మళ్లీ గాడిన పడుతోంది. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో జోష్ కనిపిస్తోంది. వెండి ధర ఢిల్లీలో స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్, విజయవాడలలో భారీగా పుంజుకుంది.
Gold Rate Today 15th July 2021: బులియన్ మార్కెట్ మళ్లీ గాడిన పడుతోంది. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో జోష్ కనిపిస్తోంది. వెండి ధర ఢిల్లీలో స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్, విజయవాడలలో భారీగా పుంజుకుంది. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. Also Read: Smartphones Price In India: రూ.20 వేలలో లభ్యమవుతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, మీరూ ఓ లుక్కేయండి
Gold Rate in Hyderabad 15th July 2021: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు వరుసగా మూడోరోజు పుంజుకున్నాయి. తాజాగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రూ.270 చొప్పున బంగారం ధర పెరిగింది. నేడు హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,260 అయింది. 22 క్యారెట్ల సైతం ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.45,150కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరుగుతున్నా ఢిల్లీ మార్కెట్‌లో జోష్ కనిపించడం లేదు. ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నటి ధరలతోనే మార్కెట్ అవుతున్నాయి. దేశ రాజదాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,260 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,060కు చేరుకుంది. Also Read: SBI Doorstep Banking Service: కరోనా నేపథ్యంలో ఖాతాదారులకు ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం, అర్హత, ఛార్జీల పూర్తి వివరాలు
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఓరోజు పెరిగితే మరుసటి రోజు తగ్గుతున్నాయి. నిన్న తగ్గిన వెండి ధరలు ఢిల్లీలో నేడు రూ.300 మేర పెరిగాయి. దాంతో 1 కేజీ వెండి రూ.69,500 అయింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వెండి ధర రూ.5,200 మేర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.74,400కు చేరుకుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook