Gold Price Increase : భారీగా పెరగనున్న బంగారం ధరలు.. సెప్టెంబర్ నెలలో తులం ఎంత అవుతుందంటే

Gold Price Increase : బంగారం ధరలు భారీగా పెరుగుతన్నాయి. శుక్రవారం 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 400 వరకు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్  కావడంతో చాలా మంది బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేంద్రం బడ్జెట్ సమర్పించిన వేళ ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర..ఆ తర్వాత కూడా తగ్గుదల కనిపించింది. అయితే కొన్ని రోజుల నుంచి మళ్లీ పెరుగుదల ఉంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల సెప్టెంబర్ బంగారం ధర భారీగా పెరగనున్నట్లు బులియన్ నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

1 /6

Gold Rate Increase in September :  బంగారం ధరలు సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు గమనించినట్లయితే, అమెరికాలోని మల్టీ కమిటీ ఎక్స్ చేంజ్ లో బంగారం ధరలు ఇప్పటికే ఒక ఔన్సు అంటే సుమారు 31 గ్రాములకు గానూ 2500 డాలర్లు దాటి కొనసాగుతోంది. 

2 /6

గత ఏడాదికాలంగా గమనించినట్లయితే బంగారం ధర ఏకంగా 580 డాలర్లు పెరిగింది. అంటే దాదాపు 30% పెరిగింది అని అర్థం. నెలరోజులుగా గమనించినట్లయితే బంగారం ధర సుమారు మూడు శాతం వరకు పెరిగింది. అంటే దాదాపు 80 డాలర్లు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 460 డాలర్లు పెరిగింది. అంటే జనవరి నుంచి గమనించినట్లయితే 22 శాతం పెరిగినట్లు చూడవచ్చు.  

3 /6

అటు దేశీయంగా కూడా గమనించినట్లయితే, బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూసినట్లయితే, బంగారం ధర 65000 నుంచి 73 వేల రూపాయల వరకు పెరిగింది. అంటే 8 నెలల కాలంలో బంగారం ధర దాదాపు 8 వేల రూపాయలు పెరిగింది. మధ్యలో బంగారం ధర గరిష్ట స్థాయిని కూడా నమోదు చేసింది. జూలై నెలలో బంగారం ధర రూ. 76,000 వరకు వెళ్ళింది.   

4 /6

అక్కడ నుంచి పతనం అవుతూ బంగారం ధర రూ. 67 వేల వరకు పతనమైంది ప్రస్తుతం బంగారం ధర రికవరీ బాట పట్టింది. అయితే ఇక్కడ నుంచి బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించినప్పటికీ బంగారం ధర అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు రికార్డు స్థాయి దిశగా కదులుతున్నాయి.  

5 /6

ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ కీలక భేటీలో వడ్డీరేట్లను అరశాతం మేర కట్ చేసే అవకాశం ఉందనే వార్తలు రావడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి. ముఖ్యంగా బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించినట్లయితే, అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల పై వచ్చే రాబడి తగ్గిపోతుంది.   

6 /6

దీంతో ఇన్వెస్టర్లు తమ ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో తమ పెట్టుబడులను అధిక రాబడి అందించే బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది. దీని బేరీజు వేసుకున్నట్లయితే, బంగారం ధరలు సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉన్నట్లయితే బంగారం ధర సెప్టెంబర్ నెలలో 24 క్యారెట్ల 10 గ్రాములకుగాను రూ. 80,000 దాటే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.