Gold Price Today 30th December 2020: బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అయితే అంతలోనే క్షీణిస్తున్నాయి. అటు బంగారం వ్యాపారులకు, ఇటు కొనుగోలుదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు మిశ్రమంగా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు క్షీణించగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి స్థిరంగా కొనసాగుతోంది.
బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు(Gold Price Today) అనూహ్యంగా పెరుగుతున్నాయి. అయితే అంతలోనే క్షీణిస్తున్నాయి. అటు బంగారం వ్యాపారులకు, ఇటు కొనుగోలుదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు మిశ్రమంగా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు క్షీణించగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి స్థిరంగా కొనసాగుతోంది. Also Read: Secured Credit Card: మీతో సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి ఎవరికి ఇస్తారో తెలుసా!
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.330 మేర దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.50,950 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.400 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.46,700కి పతనమైంది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలలో (Gold Price Today) స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం నిన్నటి ధరలో కొనసాగుతోంది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,250 వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర సైతం నిన్నటి ధరతో విక్రయాలు జరుగుతున్నాయి. గత ఆరు రోజుల మాదిరిగానే ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.48,820 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి
బంగారం ధరలతో పోటీపడి మరి వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిసెంబర్ తొలి అర్ధభాగంలో వెండి ధరలు భారీగా పెరిగాయి, గత వారం దిగొచ్చిన వెండి మరోసారి ధరలు పెరుగుతున్నాయి అయితే ఢిల్లీ మార్కెట్‌లో తాజాగా రూ.600 మేర పెరిగింది. నేటి మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.200 మేర స్వల్పంగా పెరిగింది. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.72,500కి చేరింది. Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే