Gold Rate Update 21 June 2021: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దేశంలో తగ్గిపోయినా, బులియన్ మార్కెట్‌పై మాత్రం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఏపీ, తెలంగాణలో బంగారం ధర మరోసారి దిగిరాగా, ఢిల్లీలోనూ బంగారం ధరలు పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.
Gold Rate Update 21 June 2021: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దేశంలో తగ్గిపోయినా, బులియన్ మార్కెట్‌పై మాత్రం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఏపీ, తెలంగాణలో బంగారం ధర మరోసారి దిగిరాగా, ఢిల్లీలోనూ బంగారం ధరలు పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. Also Read: SBI Customers Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు సరికొత్త సౌకర్యం, ఏ ఛార్జీలు వసూలు చేయరు
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో బంగారం ధరలు మరోసాయి పతనమయ్యాయి. తాజాగా రూ.280 మేర తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,000కి క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,000కి దిగొచ్చింది.
దేశ రాజధానిలో పసిడి ధరలు గత పది రోజులుగా తగ్గుతున్నాయి. తాజాగా ఢిల్లీలో రూ.160 మేర స్వల్పంగా ధర దిగొచ్చింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,340కి క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,150 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. Also Read: Good News For Motorists: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ వ్యాలిడిటీ ముగిసిందా, అయితే మీకు గుడ్ న్యూస్ తెలుసా
దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 1 కేజీ వెండి రూ.67,600 వద్ద మార్కెట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వెండి ధర నిలకడగా ఉంది. హైదరాబాద్, విజయవాడలలో వెండి 1 కేజీ ధర రూ.73,100కు దిగొచ్చింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook