Cholesterol: శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ పెరిగేందుకు ఏం తినాలి

శరీరంలో కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఉంటే గుండె పోటు వ్యాధులు కూడా ఎదురౌతాయి. అదే సమయంలో గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ శరీరంలో తగిన మోతాదులో ఉండాలి. గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం తినాలో తెలుసుకుందాం.

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఉంటే గుండె పోటు వ్యాధులు కూడా ఎదురౌతాయి. అదే సమయంలో గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ శరీరంలో తగిన మోతాదులో ఉండాలి. గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం తినాలో తెలుసుకుందాం.
 

1 /5

అవకాడో అవకాడో అనేది శరీరంలో బ్లడ్ వెసెల్స్ ఆరోగ్యానికి అద్బుతంగా పనిచేస్తాయి. హెచ్‌డీఎల్ లెవెల్స్ పెరుగుతాయి. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను దూరం చేస్తాయి.

2 /5

ఫ్యాట్ చేప శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ లెవెల్స్ పెరగాలంటే ట్యూనా, సాల్మన్ వంటి ఫ్యాట్ ఫిష్ తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేందుకు దోహదం చేస్తాయి

3 /5

వాల్‌నట్స్ వాల్‌నట్స్ డైట్‌లో చేర్చడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరంలో వ్యర్ధాలు బయటకు తొలగిపోతాయి. వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేయవచ్చు. ముఖ్యంగా హెచ్‌డీఎల్ లెవెల్స్ పెరుగుతాయి.

4 /5

ఆకు కూరలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించాల్సి ఉంటుంది. అదే సమయంలో గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ పెంచాల్సి ఉంటుంది. దీనికోసం ఆకు కూరలు రోజూ డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. తృణధాన్యాలు కూడా మంచి ప్రత్యామ్నాయం

5 /5

పన్నీరు ఇటీవలి కాలంలో ఆధునిక బిజీ ప్రపంచం కారణంగా ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నామనేది ఎవరూ పట్టించుకోవడం లేదుయ ఫలితంగా శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతంది. అందుకే డైట్‌లో పన్నీరు ఉంటే కాల్షియం, విటమిన్ బి12, ఫాస్పరస్, సెలేనియం వంటి పోషకాలు అందడంతో పాటు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.