Guru Gochar: నవరాత్రుల నుంచి ఈ 4 రాశుల వారికి ఇంట్లో పెళ్లి బాజాలు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతాయి..

Guru Gochar: వృషభ రాశిలో బృహస్పతి వక్ర గమనంలో ప్రయాణిస్తున్నాడు. దాదాపు పుష్కర కాలం తర్వాత దేవగురువు వృషభరాశిలో  తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. బృహస్పతి వక్ర గమనం వలన ఈ రాశుల వారికీ అనుకోని అదృష్టం కలగబోతుంది.

1 /6

వక్ర గురువు 2024: 3 అక్టోబర్ 2024 శారదా నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. నవరాత్రి సమయంలోనే చాలా ముఖ్యమైన గ్రహాలు వివిధ రాశుల్లో సంచరిస్తున్నాయి. శనీశ్వరుడు నక్షత్ర మార్పు వలన బృహస్పతి వచ్చే ఫిబ్రవరి వరకు తిరోగమనంలో ప్రయాణించనున్నాడు.  దీని వలన ఈ నాలుగు రాశుల వారీకీ తిరుగులేని అదృష్టం కలిగించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

2 /6

మేషరాశి.. 12 రాశులలో మొదటిదైన మేషంలో శని దేవుడికి అంత అనుకూలం కానప్పటికీ గురు గ్రహం తిరోగమనం వలన అనేక సమస్యల నుండి బయటపడతారు. ఈ వ్యక్తులు వారి మాట ఆధారంగా వారి  పనులను పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా సమయానుకూలంగా ఆర్ధిక ప్రయోజనాలు ముడిపడి ఉంటడం వలన అనేక రకాలుగా బాగానే ఉంటుంది.

3 /6

వృషభ రాశి.. బృహస్పతి వృషభంలో తిరోగమనంలో  సంచరిస్తున్నాడు కాబట్టి ఈ రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుంది. అంతేకాదు అనేక ఆర్ధిక ప్రయోజనాలను చేకూర్చబోతుంది. మీలో ఆత్మ విశ్వాసం పెంచుతుంది. కెరీర్ లో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. అనుకున్న చోటికి బదిలి జరగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుంది. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు ఇది యోగ కాలం. వివాహా ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

4 /6

మిథున రాశి.. బృహస్పతి తిరోగమనం వలన మిథున రాశి వారికీ అదృష్టం బంక పట్టినట్టు పడుతుంది. ఆర్ధికంగా ఎన్నో లాభాలను అందుకుంటారు. పొదుపు విషయంలో మరింత జాగ్రత్త అవసరం. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలున్నాయి. విదేశీ యాన యోగం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశముంది.

5 /6

ధనుస్సు.. ధనుస్సు రాశి వారికీ బృహస్పతి వృషభంలో తిరోగమన వలన ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న విజయాలు మీ సొంతం అవుతాయి. శతృవులపై విజయం సాధిస్తారు. కొత్త వాహనం కొనుగోలుకు ఇదే మంచి సమయం. పెళ్లి ప్రయత్నాలు ఫలమిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్  పెరుగుతుంది.

6 /6

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం పండితులు.. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం గా ఇచ్చాము. ZEE MEDIA NEWS దీన్ని ధృవీకరించడం లేదు.