HBD Shriya Saran: శ్రియాశరన్.. తెలుగు వారికి ఎందుకంత ప్రత్యేకం..?

Shriya Saran: గ్లామర్ తోనే కాదు చాలెంజింగ్ పాత్రలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రియా శరన్ ను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో పలు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

1 /5

ప్రముఖ బ్యూటీ శ్రియా శరన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ దక్కించుకున్న ఈమెను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. మరి వారు ఈమెను అంతలా ఓన్ చేసుకోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.   

2 /5

ఇష్టం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె,  ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ఆడియన్స్ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిందని చెప్పవచ్చు. నటిగా బహుమఖ ప్రజ్ఞాశాలిగా పేరు దక్కించుకున్న శ్రియ తన అద్భుతమైన నటనతో నువ్వే నువ్వే చిత్రంతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ అద్భుతమైన నటనా ప్రదర్శన కనబరిచి ఆడియన్స్ ను  మెప్పించింది. అంతేకాదు తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

3 /5

కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా చాలెంజింగ్ పాత్రలు కూడా పోషించి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేస్తూ మరొకసారి అలరించింది. ముఖ్యంగా తన అద్భుతమైన నటనతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె స్టార్ హీరోలతో కూడా పనిచేసింది.  చిరంజీవిని మొదలుకొని మహేష్ బాబు వరకు ఎంతో మందితో పని చేసిన ఈమె ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించింది.అంతేకాదు పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె ది అదర్ అండ్ ఆఫ్ ది లైన్ వంటి హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. 

4 /5

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడా అద్భుతమైన నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా పవిత్ర సినిమాలో వేశ్య గా నటించి ఆకట్టుకుంది.ఇకపోతే నటనతో ప్రేక్షకులను మెప్పించింది కానీ ఏ రోజు కూడా పుకార్ల జోలికి వెళ్లలేదు. ఇప్పటివరకు ఈమెపై ఎటువంటి రూమర్స్ కూడా సృష్టించలేదు అనడంలో సందేహం లేదు. తోటి నటీనటులతో చక్కగా కొనసాగుతూ మంచి మనసున్న అమ్మాయిగా పేరు సొంతం చేసుకుంది. 

5 /5

ఇలాంటి ఎన్నో లక్షణాలు శ్రియాలో ఉన్నాయి కాబట్టే తెలుగు ప్రేక్షకులు ఏమైనా సొంతం చేసుకున్నారు ఇప్పటికీ కూడా ఆమెను ఆదరిస్తున్నారు.