Happy Ugadi 2024 In Telugu: మీకోసం, మీ మిత్రుల కోసం శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, కోట్స్‌..

Happy Ugadi Top 10  Best Wishes 2024 In Telugu: హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ పండుగను కొత్త సంవత్సరంలోని మొదటి పండగగా కూడా భావిస్తారు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలను తెలియజేయండి.


Happy Ugadi Top 10  Best Wishes And 2024 In Telugu: ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు కర్ణాటక గోవా ప్రజలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అందుకే ఈ పండగకి భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉగాది పండుగను పూర్వికులు యుగాదిగా పిలుచుకునేవారు.. పోను పోను ఈ పేరు కాస్త ఉగాదిగా మారుతూ వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ పండగను ప్రతి సంవత్సరం మార్చి నెలలోని చివరి వారాల్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో వస్తుంది. ఈ పండగ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీ వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున అందరి జీవితాలు శుభప్రదం కావాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలను ఇలా సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.
 

1 /10

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ సంవత్సరం మీకు శుభం, శ్రేయస్సు, సంతోషాన్ని కలిగించాలని మనసార కోరుకుంటున్నాము.  

2 /10

ఉగాది పండుగ సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ జీవితంలో కొత్త ఆశలు, కలలను నింపాలని కోరుకుంటున్నాము.  

3 /10

ఉగాది పండుగ సందర్భంగా మీకు, మీ కుంటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం, సంపద, శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నాము.  

4 /10

క్రోధినామ సంవత్సరంలో మీ జీవితం శ్రేయస్సుతో నింపాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు!  

5 /10

మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.. ఈ సంవత్సరం మీకు అన్ని విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నాము.  

6 /10

క్రోధినామ సంవత్సరం మీకు శుభం కలిగించాలని కోరుకుంటూ..ఉగాది శుభాకాంక్షలు..  

7 /10

ఉగాది పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యుల్లో సంతోషం, శాంతి నింపాలని కోరుకుంటూన్నాము.  

8 /10

క్రోధినామ సంవత్సరం మీకు కొత్త అవకాశాలను తీసుకురావాలని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలు..  

9 /10

ఉగాది పండుగ సందర్భంగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు.. ఈ సంవత్సరం మీ అన్ని కోరికలు నెరవేరాలని ఆ శివుడిని కోరుకుంటున్నాను.  

10 /10

క్రోధినామ సంవత్సరంలో మీకు అన్ని దేవతల అనుగ్రహం లభించి, శుభం కలిగించాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు!