చలికాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజంగా ఈ సమయంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధులు తలెత్తుతుంటాయి. ఈ సమస్యల్నించి బయటపడాలంటే చలికాలంలో విరివిగా లభించే ఉసిరి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Amla Benefits: చలికాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజంగా ఈ సమయంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధులు తలెత్తుతుంటాయి. ఈ సమస్యల్నించి బయటపడాలంటే చలికాలంలో విరివిగా లభించే ఉసిరి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
కంటి చూపు, చర్మ సమస్యలు రోజూ క్రమం తప్పకుండా ఉసిరి నీళ్లు తాగడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. చర్మ సమస్యలు దూరమౌతాయి. ఉసిరి జ్యూస్ కూడా తాగవచ్చు.
జీర్ణక్రియ ఉసిరి రోజూ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరం చేసుకోవచ్చు.
జలుబు-పడిశం ఉసిరి రోజూ తినడం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఎ కారణంగా జలుబు, పడిశం, దగ్గు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
పోషక విలువలు ఉసిరి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా సమస్యల్నించి బయటపడవచ్చు. ఇందులో వివిధ రకాల పోషకాలతో పాటు విటమిన్ సి పెద్దఎత్తున ఉంటుంది.
ఇమ్యూనిటీ రోజూ క్రమం తప్పకుండా ఉసిరి తీనడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది.