Cholesterol Tips: కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైన పదార్ధం. కానీ పరిమిత మోతాదులోనే ఉండాలి. అది కూడా గుడ్ కొలెస్ట్రాల్ అయుండాలి. చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. అయితే మీ డైట్‌లో ఈ నేచురల్ హెర్బ్స్ జోడిస్తే..కొలెస్ట్రాల్ చాలా వేగంగా నియంత్రణలో వచ్చేస్తుంది.
పసుపు ప్రతి ఇంట్లో ప్రతి వంటలో వినియోగిస్తారు. పసుపు చాలా వ్యాధుల్నించి రక్షిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా పసుపు పాలు తీసుకుంటే..కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
తులసి మొక్క దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటుంది. తులసి ఆకుల రసం లేదా తులసి టీ క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ సులభంగా నియంత్రితమౌతుంది.
రోజ్‌మెర్రీ క్రమం తప్పకుండా సేవిస్తే కొలెస్ట్రాల్ సమస్య దూరమౌతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
ఇక అల్లం మరో అద్భుత పరిష్కారం. అల్లంతో చాలా రకాల అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. అల్లంతో కొలెస్ట్రాల్ సమస్య చాలా త్వరగా తొలగిపోతుంది.
మెంతుల వినియోగం ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారంగా చెప్పవచ్చు. ప్రతిరోజూ ఉదయం పరగడుపున నానబెట్టిన మెంతుల్ని తీసుకుంటే..కొలెస్ట్రాల్ చాలావేగంగా తగ్గుతుంది.