Anemia Test: టెస్టులు అవసరం లేదు.. రక్తహీనతను ఇలా కూడా కనుక్కోవచ్చు

Anemia: రెండు నెలలకు ఒకసారి రక్తహీనత ఉండి అన్న అనుమానంతో టెస్టులు చేసుకుంటున్నారా? అయితే ఇలా చేసుకున్న ప్రతిసారి మనం బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలా టెస్టులు చేసుకోకుండా.. మన శరీరంలో జరిగే మార్పుల ద్వారానే.. రక్తహీనతను ఎలా కనుక్కోవచ్చో ఒకసారి చూద్దాం. 

1 /4

కొంతమంది తమకు రక్తహీనత.. ఉందా లేదా తెలుసుకోవడానికి తరచూ టెస్టులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా రక్తం ఇచ్చి మరి.. రక్తహీనత గురించి.. తెలుసుకోవలసిన అవసరం లేదు. మన శరీరంలో జరిగే కొన్ని మార్పుల ద్వారా కూడా ఇవి గమనించవచ్చు. 

2 /4

ఆరోగ్యకరమైన రక్తకణాలు తగ్గితే.. మనకు కొంచెం పని చేసిన ఎక్కువ అలసటగా ఉంటుంది. రక్తహీనత ఉంటే కండరాలు ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటాయి. అంతేకాదు కూర్చున్నప్పుడు ఎక్కువగా తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తుంది.

3 /4

రక్తహీనత ఉండే వారి చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది.రక్తహీనత ఉన్నప్పుడు.. మూత్రం గులాబీ లేదా ఎర్ర రంగులో వస్తూ ఉంటుంది. ఇలా మూత్రం రంగు మారినప్పుడు మనం వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.

4 /4

తరచూ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కానీ.. మనకు రక్తహీనత ఉన్నట్లే అర్థం. కాబట్టి ఇలాంటి సమస్యలు కనిపించినప్పుడు మాత్రమే.. టెస్టులు చేసుకుని డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.