Heavy Rush In Tirumala: అంతా గోవింద నమస్కారడం ఆదివారం కిక్కిరిసి పోయిన భక్తజనం తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కార్తీకమాసం తర్వాత ఇలా ఎక్కువ సంఖ్యలో కనిపించారు. ఇందుకు తగిన ప్రత్యేక ఏర్పాట్లను కల్పించామని టీటీడీ యంత్రాంగం ప్రకటించింది.
కంపార్ట్‌మెంట్లన్నీ పూర్తిగా భక్తజనంతో నిండిపోయిందని తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం ప్రకటించింది. ఆదివారం కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమల దేవస్థానానికి చేరుకున్నారు శ్రీవారి దర్శనార్థం బారులు తీరారు.
భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో తిరుమల యంత్రాంగం తగిన ఏర్పాట్లను కూడా చేసింది. సాధారణంగా వీకెండ్ అంటేనే తిరుమలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కానీ, ఈసారి అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగింది.
ముఖ్యంగా తుఫాను, భారీ వర్షాలు నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గుతుందని టిటిడి యంత్రం అంచనా వేసింది. కానీ అనూహ్యంగా భక్తుల రద్దీ ఆదివారం రోజు కూడా భారీగా పెరిగింది.
ఇక శ్రీవారి దర్శనార్థం 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా ప్రవేశించిన వారికి శ్రీవారి దర్శనానికి 13 గంటల పాటు సమయం పట్టింది. టైమ్స్ లార్డ్ భక్తులకు రెండు గంటల లోపు దర్శనం పూర్తయిందని టీటీడీ తెలిపింది.
ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనార్థం దాదాపు 78 వేలకు పైగా భక్తులు వచ్చారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.5 కోట్లు పైగా వచ్చాయి. ఈనెల డిసెంబర్ 12న చక్రతీర్థం నిర్వహిస్తున్నట్లు తిరుమల యంత్రాంగం ప్రకటించిన సంగతి తెలిసిందే..