Hero Duet 2024: హీరో మరో పవర్‌ఫుల్‌ స్కూటర్.. రూ.48 వేలకే అద్భుతమైన ఫీచర్స్ బైక్..

Hero Duet 2024 Launch Date: హీరో నుంచి మార్కెట్‌లో అద్భుతమైన స్కూటర్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ హీరో డ్యూయెట్ 2024 పేరుతో విడుదల కానుంది. అయితే ఈ స్కూటర్‌ ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే దీనిని కంపెనీ వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే ఈ స్మార్ట్‌ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
 

1 /5

ఈ హీరో డ్యూయెట్ 2024 స్కూటర్‌ శక్తివంతమైన 110.9 సిసి ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.   

2 /5

ఈ ఇంజన్‌  గరిష్టంగా 8 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ మైలేజీ వివరాల్లోకి వెళితే.. లీటర్‌కి  63 కిమీ మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా గంటకు 85 కిమీ వేగంతో దూసుకుపోతుంది. 

3 /5

ఈ హీరో డ్యూయెట్ 2024 స్కూటర్ స్టైలిష్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో USB 3.0 ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో సైడ్ స్టాండ్ ఇండికేటర్‌ కూడా లభిస్తున్నాయి.  

4 /5

ఈ స్కూటర్‌ మార్కెట్‌లో మూడు కలర్ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. అంతేకాకుండా దీని డిజైన్‌ చూస్తే.. ఫ్రంట్‌లోని క్రోమ్ హైలైట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు డ్యూయల్-టోన్ రియర్-వ్యూ మిర్రర్‌లు కూడా లభించనున్నాయి.   

5 /5

దీని ధర వివరాల్లోకి వెళితే.. ఇది ధర రూ.48,280తో లాంచ్‌ కానుంది. అంతేకాకుండా ఇది వివిధ రకాల వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది.