Hight Alert Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండం తీవ్రతరం కాబోతుంది. విశాఖకు అతి దగ్గరలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది ఈశాన్య దిశగా కదులుతోంది. ఇది విశాఖకు కేవలం 430 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీనివల్ల ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తీవ్ర వాయుగుండం వల్ల కాకినాడ, అనకాపల్లి, మన్యం, విజయ నగరం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇప్పటికే ఉత్తరాంధ్ర భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురువనున్నాయి. ఈ ప్రభావం తమిళనాడులోని చెన్నైలో కూడా ఉంటుంది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేశారు.
బంగాళాఖాతంలో గత కొన్ని రోజులుగా అల్పపీడనాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అక్టోబర్ నెలలో కూడా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చారు. చెన్నైలో కూడా తీవ్ర ప్రభావం పడింది. వాహనాలు బ్రిజ్‌పై నిలుపుకున్నారు.
తాజాగా ఈ డిసెంబర్ నెలలో కూడా అల్పపీడన ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో చెదురు మొదురు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తిరుపతిలో కూడా భారీవర్షాలు పోయిన వారంలో బాగా కురిసింది.