మీరు వెళ్లాలి అనుకుంటున్న హిల్ స్టేషన్ వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయి.. టెంపరేచర్ వంటి విషయాలు తెలుసుకోండి.
రాత్రి 9 తరువాత ఇలాంటి ప్రదేశాల్లో తక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా సిద్ధంగా ఉండాలి. అయితే మీరు బుక్ చేసుకోబోయే హోటల్‌కు ఫోన్ చేసి రూమ్ హీటర్, వాటర్ హీటర్, కెటిల్, తాగడానికి వేడి నీళ్లు ఇస్తారా లేదా కనుక్కోండి.
మంచు కొండల వద్దకు వెళ్తే తప్పకుండా స్నో డ్రెస్ అండ్, షూస్, గ్లౌజ్ వేసుకోవాలి. లేదంటే అంత దూరం వెళ్లి మీరు కొన్ని నిమిషాలు మాత్రమే ఎంజాయ్ చేయగలరు.
మనాలీ లాంటి ప్రదేశాల్లో మంచు పడుతున్న సమయంలో మనం సొంత వాహనం కన్నా.. అక్కడి స్థానిక క్యాబ్ సర్వీస్ వాడుకోవడం ఉత్తమం. వారికి ఎక్కడ ఎలాంటి రోడ్డు ఉంటుందో తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లగరు.
జ్వరం, జలుబు వంటి టాబ్లెట్స్‌తో పాటు బ్యాండెయిడ్, జండూబామ్..ఇలా మీకు అవసరం అనిపించిన మెడికల్ సామగ్రీతో ఒక కిట్ తప్పకుండా పెట్టుకోండి. అలాగే విరోచనాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి.