Best Electric Scooters: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ప్రత్యామ్నాయంలో మార్కెట్‌లో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు లేదా కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. మీరు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా. అయితీ ఇది మీ కోసమే. ఇండియాలో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం. ఒకసారి రీఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. ఇక ఈ స్కూటర్ల ధర, ప్రత్యేకతలేంటనేది పరిశీలిద్దాం.
TVS IQube: ఈ స్కూటర్‌ను 2020 ప్రారంభంలో ప్రవేశపెట్టారు. ఇందులో మీకు 4.4kw సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటర్ లభిస్తుంది. దీంతోపాటు ఫుల్ ఛార్జింగ్ అనంతరం దాదాపు 75 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది. దీని వేగం గంటకు 78 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఈ స్కూటర్ ధర దాదాపుగా 1 లక్ష 15 వేలుంటుంది.
Bajaj Chetak Electric Scooter నిజంగా అద్భుమైందే. గత ఏడాది చేతక్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. ఎంట్రీ లెవల్ Urbane మరియు టాప్‌ఎండ్ Premium. ఈ స్కూటర్లలో 3.8kw, 4.1kw పవర్ మోటర్ ఉంటుంది. ఫుల్ ఛార్జింగ్ తరువాత ఈ స్కూటర్ ఈకో మోడ్‌లో 95 కిలోమీటర్ల వరకూ వెళ్లగలదు.
Ather 450 X ఏథర్ ఎనర్జీ ఇండియాలో అతి వేగంగా ఎదుగుతున్న ఈవీ స్టార్టప్స్‌లో ఒకటి. ఈ బ్రాండ్ కేవలం దక్షిణ భారతదేశంలోని బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లోనే అందుబాటులో ఉంది. త్వరలో ఢిల్లీ, ముంబాయి సహా ఇతర నగరాల్లో ప్రవేశించనుంది. ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగల్ ఛార్జ్‌లో 107 కిలోమీటర్ల ఇవ్వగలదు. ఈ స్కూటర్ ధర లక్ష రూపాయల్నించి ప్రారంభమవుతుంది.
Ampere Magnus EX ఈ మధ్యనే Ampere ఎలక్ట్రిక్ స్కూటర్ Magnus EXను ప్రవేశపెట్టింది. వినూత్నమైన, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కూడిన మేగ్నస్ ఎక్స్ ఎక్స్‌షోరూమ్ ధర పూణేలో 68 వేల 999 రూపాయలుగా ఉంది. మేగ్నస్ ఎక్స్ అనేది అద్భుతమైన సామర్ధ్యం కలిగిన ఎకానమికి రేంజ్ స్కూటర్. ఫుల్‌ఛార్జ్ అయితే గంటకు 121 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
OLA S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో టాప్ 5 సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో తొలి స్థానం ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర 99 వేల 999 రూపాయలు. ఇది 121 కిలోమీటర్ల వరకూ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 గంటలు పడుతుంది. ఓలా ఎస్ 1 ప్రో మోడల్ కూడా ఉంది. ఈ స్కూటర్ ధర 1 లక్షా 30 వేల రూపాయలు. ఈ స్కూటర్ మైలేజ్, ఫీచర్లు ఎక్కువ.