IPL 2024: ఐపీఎల్ 2024లో ఈ భారత వికెట్ కీపర్లే అన్ని ప్రాంచైజీలకు టార్గెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్  2024 సీజన్ వచ్చే ఏడాది జరగనుంది. చాలామంది క్రికెటర్లు సామర్ద్యాన్ని పరీక్షించుకోనున్నారు. టీమ్ ఇండియాకు చెందిన కొంతమంది క్రికెటర్లపై ముఖ్యంగా ఈ వికెట్ కీపర్లపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. వచ్చే ఏడాది వెస్డిండీస్-అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎవరు ఆడతారో లేదో అనేది ఐపీఎల్ 2024 ప్రతిభను బట్టి నిర్ణయం కావచ్చు.

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్  2024 సీజన్ వచ్చే ఏడాది జరగనుంది. చాలామంది క్రికెటర్లు సామర్ద్యాన్ని పరీక్షించుకోనున్నారు. టీమ్ ఇండియాకు చెందిన కొంతమంది క్రికెటర్లపై ముఖ్యంగా ఈ వికెట్ కీపర్లపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. వచ్చే ఏడాది వెస్డిండీస్-అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎవరు ఆడతారో లేదో అనేది ఐపీఎల్ 2024 ప్రతిభను బట్టి నిర్ణయం కావచ్చు.

1 /5

సంజూ శామ్సన్ 2015 టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకూ కేవలం 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లే ఆడాడు. మొత్తం 374 పరుగులు చేశాడు. 

2 /5

సంజూ శామ్సన్‌కు కూడా మంచి అవకాశాలుండవచ్చు. వన్డే ప్రపంచకప్ 2023కు ముందే ఐర్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. సంజూ శామ్సన్‌ను దక్షిణాఫ్రికా పర్యటనకు సైతం ఎంపిక చేశారు. సంజూ ఈ సిరీస్ తరువాత ఐపీఎల్ 2024లో ఎంపిక కావచ్చని అంచనా. 

3 /5

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు పోటీలో ఉండే మొదటి వ్యక్తి కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ అద్బుతమైన వికెట్ కీపరే కాకుండా మంచి బ్యాటర్ కూడా. 

4 /5

పంజాబ్‌కు చెందిన యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా టీ20 సిరీస్‌లో ఆడే అవకాశం లభించింది. రానున్న ఐపీఎల్ ఆడేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాడు. జితేష్ శర్మ ఇప్పటి వరకూ 5 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 64 పరుగులు చేశాడు. 

5 /5

ఇషాన్ కిషన్ కూడా తరచూ టీమ్ ఇండియాకు ఆడుతుంటాడు. 25 ఏళ్ల ఇషాన్ కిషన్ 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 796 పరుగులు సాధించాడు. ఇందులో  ఆరు అర్ధ సెంచరీలున్నాయి. మొత్తం 72 టీ20 మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ 3 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 4435 పరుగులు స్కోర్ చేశాడు.