Jio: జియో యూజర్లకు బంపర్ ఆఫర్... 98 రోజుల అన్ లిమిటెడ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..

Jio Bumper Offer: రిలయన్స్ జియో దిగ్గజ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటిస్తుంది. యూజర్లను కొత్త ప్యాకేజీలతో ఆకట్టుకునేలా సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తుంది.. జియో సిమ్ యూజర్లకు ఇది గుడ్ న్యూస్. బిఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇస్తూ జియో మరో బంపర్ ఆఫర్ ను మీ ముందుకు తీసుకువచ్చింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

జూలై నెలలో పెరిగిన టెలికాం ధరల నేపథ్యంలో జియో సిమ్ యూజర్లు ఎక్కువగా కోల్పోయింది. వారిని తిరిగి మళ్ళీ ఆకర్షించేందుకు జియో సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా అతి తక్కువ ధరలకే ప్లాన్లను ముందుకు తీసుకువస్తుంది.   

2 /5

జియో 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లో కొత్త ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇది 490 మిలియన్ యూజర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ అని చెప్పవచ్చు... కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఈ రీఛార్జి ప్లాన్ కేవలం రూ. 999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది 98 రోజులపాటు వ్యాలిడిటీ వస్తోంది.  

3 /5

ఈ రీఛార్జ్ ప్లాన్ లో మీరు అపరిమిత వాయిస్ కాల్స్ ఉచితంగా ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు. అదే విధంగా ఇందులో 5g సేవలు పొందుతారు. మీ ఏరియాలో 5జి సర్వీస్ అందుబాటులో ఉంటే హై స్పీడ్ డేటా పొందుతారు.  

4 /5

ఈ రిలయన్స్ జియో ప్లాన్ లో మొత్తంగా 196 జిబి డేటా పొందుతారు. అంటే ప్రతిరోజు మీరు 2జిబి డేటా లిమిట్ ముగిసిన తర్వాత 64 kbps డేటా స్పీడ్ వస్తుంది.  

5 /5

ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు అదనంగా జియో సినిమా కూడా పొందుతారు. పెరిగిన టెలికాం ధరల తర్వాత జియో, బిఎస్ఎన్ఎల్ గట్టి పోటీని ఇచ్చేలా ఈ కొత్త సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. కొత్త ఆఫర్లతో కస్టమర్లను మళ్లి ఆకర్షిస్తోంది.