Devara OTT Steaming Release Date Officially Announced : జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం ‘దేవర పార్ట్ -1’ మిక్స్ డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది.ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత ‘దేవర’తో అదే రేంజ్ సక్సెస్ కాకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర పాస్ అయ్యాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో దీపావళి సినిమాల తర్వాత ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగింపు వచ్చేసింది.
మిగిలిన భాషల్లో ‘దేవర’ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ సినిమా తమిళం మినహా అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని మంచి లాభాలను తీసుకొచ్చింది. తమిళ తంబీలకు మాత్రం ఈ సినిమా పెద్దగా ఎక్కలేదనే చెప్పాలి.
‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత తారక్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర’.ఈ చిత్రం తెలంగాణ (నైజాం)లో రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా ఇక్కడ రూ. 64 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగులో రూ. 170 కోట్ల షేర్ (రూ. 280 కోట్ల గ్రాస్ ) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్పాయి.
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఈ నెల 8న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’. మిక్స్ డ్ టాక్ తో ఎన్టీఆర్ ఇమేజ్ తో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టింది.
రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ వస్తుందనే సెంటిమెంట్ కు ‘దేవర’ సక్సెస్ తో ఎన్టీఆర్ పాతర చేసాడు. అంతేకాదు 2015లో ‘టెంపర్’ మూవీతో మొదలైన ఎన్టీఆర్ సినీ జైత్రయాత్ర ‘దేవర’ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. వరుసగా తొమ్మిదేళ్ల నుంచి ఫ్లాప్ అంటే ఎరగని హీరోగా టాలీవుడ్ లో ఈ జనరేషన్ లో హైయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న హీరోగా ఎన్టీఆర్ కొత్త రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి.